Health & Lifestyle

గుండె జబ్బులు దూరం కావాలంటే రోజుకూ 100 గ్రా. ఇవి తినాల్సిందే..!

KJ Staff
KJ Staff

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు రిఫైండ్ చేయబడిన పిండి పదార్థాలను తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే శరీరంలో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోవటం వల్ల చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు.

ఈ విధంగా గుండె జబ్బులు, రక్తపోటు, శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడానికి ప్రతిరోజు 100 గ్రాములు చిరుధాన్యాల మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టఫ్ట్ విశ్వవిద్యాలయంలోని జీన్ మేయర్ యూఎస్ డీఏ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఫైబర్ అధికంగా ఉన్నటువంటి తృణధాన్యాలను తీసుకోవటంవల్ల గుండె జబ్బుల నుంచి దూరం కావచ్చు.

నిపుణులు జరిపిన పలు అధ్యయనాలలో భాగంగా తృణధాన్యాలు ఎక్కువగా తీసుకునే వారిలో నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడమేకాకుండా, అధికంగా గుండె సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా మరికొందరిలో అధికరక్తపోటు, షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని పరిశోధకులు తెలిపారు.ఈ క్రమంలోనే చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine