Health & Lifestyle

పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. ఈ ఆహారం తినిపించాల్సిందే!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా మహమ్మారి ఇప్పటివరకు పెద్ద వారికి మాత్రమే వ్యాపిస్తూ ఉంది. అయితే థర్డ్ వేవ్ రూపంలో చిన్నపిల్లలపై ఈ మహమ్మారి పంజా విసరనుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే చాలామంది పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తొందరగా జబ్బుల బారిన పడుతున్నారు.ఇలాంటి వారికి రానున్న రోజుల్లో మరింత కఠినతరంగా మారబోతుంది కనుక పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు.మరి పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పనిసరిగా వారి రోజువారీ ఆహారంలో భాగంగాఈ ఆహార పదార్థాలను చేర్చాలని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పనిసరిగా సీజనల్ ఫ్రూట్స్ తినిపించడం ఎంతో ముఖ్యం. పండు మొత్తం తినకపోయినా కొంత భాగమైన తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇలా చేయటం వల్ల పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం పోషక పదార్థాలతో కూడినటువంటి రవ్వ లడ్డూలు, రాగి లడ్డులు,నువ్వుల లడ్డులు తినిపించడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తాయి.

పిల్లలకు ఎంతో సులభంగా జీర్ణమయ్యే పోషకాలతో నిండినట్టు వంటి ఆహార పదార్థాలను తినిపించాలి. ప్రతిరోజు రెండు జీడిపప్పులను తినిపించడం వల్ల వారి శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి కనుక రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక పిల్లలలో రోగనిరోధకశక్తి పెంపొందాలంటే నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలకు ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో నిద్రపుచ్చటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పిల్లలకు వీలైనంతవరకు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంచడం ఎంతో ఉత్తమం.

Share your comments

Subscribe Magazine