Health & Lifestyle

కొత్తిమిర సువాసనకు మాత్రమే పరిమితమా? ఆరోగ్యప్రదాయిని కూడానా?

KJ Staff
KJ Staff
Coriander
Coriander
సువాసన కోసం, వండిన వంటలను ఆకర్షణీయంగా అలకరించేదుకు వాడే ఈ చిన్ని ఆకులు ఎన్నో పోషక విలువలను, ఔషధగుణాలను కలిగి ఉన్నాయి. కొత్తిమీరలో థయామిన్ తో పాటు, వివిధ రకాల ఖనిజాలు, విటమిన్- సి, విటమిన్- బి, భాస్వరం, కాల్షియం, ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, ద్రవ ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్రొవ్వులు, పీచు పదార్థాలు మరియు నీరు సమృద్ధిగా దొరుకుతాయి.
కొత్తిమీరను వంటల్లో మిరియాలతో పాటు కలిపి వాడితే వంటకు ఒక ప్రత్యేకమైన రుచి పోషక విలువలు అందిస్తాయి. కొత్తిమిరకి అయ్యే ఖర్చు తక్కువ అయినా మంచి ఆరోగ్యపరంగా చాలా విలువైనది. కొత్తిమీర కొన్ని అశ్వస్తలకు మంచి మందుగా పనికొస్తుంది. ఉదాహరణకు మనం కొన్ని వ్యాధులకు ఈ చిన్ని ఆకులు ఎంత పెద్ద ఫలితాన్ని అందిస్తాయి అనేది మనం ఇక్కడ చర్చించుకుందాం.

శరీరంలోని క్రొవ్వును నియంత్రణలో ఉంచడం: Controlling Body Fat:

తాజా కొత్తిమీర లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. ఇవి హానికరమైన కొవ్వులను బలహీన పరిచి ఆరోగ్యవంతమైన క్రొవ్వుల స్థాయిని పెంచుతుంది.

చర్మ సౌందర్యం:Skin Beauty:

చాలా రకాలైన చర్మ సౌందర్య ఉత్ప్తుల్లో కొత్తిమీర నుండి తీసిన ఎసెన్షియల్స్నీ వాడతారు. ఎందుకంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ సౌందర్యం పెంచే ములకాలుగా పనిచేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు తగ్గి చర్మం స్థితి మెరుగు పడి కాంతి వంతంగా తయారు అవుతుంది.

మానసిక ఒత్తిడి తగ్గుదల: Stress reduction: 

కొత్తిమీర ఒక మంచి అనుభూతిని కలిగించటమే కాకుండా, మంచి భావాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును. తాజా కొత్తిమీర వాసన పీల్చిన వెంటనే ఒక తాజా అనుభూతి కలిగించే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

పోషక విలువలు: Nutritional Values:

విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంటుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం: Improving the digestive system: 

కొత్తిమీర వంటల్లో వాడటం వల్ల సువాసన మాత్రమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది. దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను మెరుగు పరచడంలో కొత్తిమిర ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

కంటి సమస్యలను తగ్గించడం: reduction of eye problems

ముందుగా చెప్పినట్టు కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి మన కంటి సమస్యలను మెరుగు పరచడంలో ముఖ్య కారకాలుగా ఉంటాయి.

ఇన్సులిన్ పెంపు: Insulin booster

నిజానికి కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది అని చాలా తక్కువ మందికే తెలుసు. ఇది శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను, వాటి నిల్వలను తగ్గిస్తుంది.
ఇలా కొత్తిమిర లో సువాసన అంశాలే కాదు ఆరోగ్య మూలకాలు కూడా ఉన్నాయి.

Share your comments

Subscribe Magazine