Health & Lifestyle

రాత్రివేళ పెరుగు తినడం మంచిదా?.. కాదా?

KJ Staff
KJ Staff

మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో పెరుగు తినకపోతే చాలామందికి భోజనం చేసినట్లు అనిపించదు. చివరిలో పెరుగు అన్నం తినకపోతే చాలామందికి కడుపు నిండదు. పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లు చాలామందికి అనిపించదు. పెరగన్నం అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా తెలుగువారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. ఇక చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా పెరగన్నం తింటూ ఉంటారు.

అయితే రాత్రివేళ పెరుగన్నం తినడం మంచిదా?.. కాదా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రివేళ్లల్లో పెరుగు తినడం మంచిది కాదని డాక్లర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం పెరుగు తింటే చాలామంచిది. శరీరం చల్ల బడుతుంది. రోజూ మధ్యాహ్నం పెరుగు తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ రాత్రిపూట తినడం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. రాత్రిళ్లు తినడం వల్లన శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. రాత్రిళ్లు తీసుకోవడం వల్లన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

-దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రిపూట పెరుగు అసలు తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు.
-రాత్రిపూట తినడం వల్లన గొంతులో కఫం ఏర్పడుతుందట.
-పెరుగుకు బదులు రాత్రివేళ పలుచని మజ్జిగ తాగితే మంచిది
-ఇక రాత్రివేళల్లో వేడివేడి ఆహారంలో పెరుగు వేసుకుని తినడం అసలు మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.

ఇక పగటిపూట పెరుగు తినడం వల్లన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

-రోజూ పెరుగు తినడం వల్లన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
-అరుగుదల సమస్యలను పరిష్కరిస్తుంది
-విటమిన్ బీ12 శరీరానికి లభిస్తుంది.
-శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందుతుంది.

Related Topics

curd, night, eat

Share your comments

Subscribe Magazine