Health & Lifestyle

డయాలసిస్ చేస్తున్న సమయంలో అటిక మామిడి తీగ ఆకురసం తాగితే.. కిడ్నీ సమస్యలు దూరం!

KJ Staff
KJ Staff

పురాతన ఆయుర్వేద వైద్యంలో ప్రకృతి సిద్ధంగా మన పరిసరాల్లో సమృద్ధిగా పెరిగి, లభించే ఔషధ గుణాలు కలిగిన మొక్కలను, వనమూలికలను ఉపయోగించి ప్రమాదకరమైన మొండి వ్యాధులను సైతం తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారించవచ్చు.అలాంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న,పల్లె ప్రజలకు సుపరిచితమైన మొక్క అటిక మామిడి తీగ మొక్క.దీనిని సంస్కృత గ్రంథాల్లో పునర్వవగా పిలుస్తారు.

అలాగే కొన్ని ప్రాంతాల్లో అంటుడు కాయ మొక్క అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూస.ఈ మొక్క ఆకులు, వేర్లు, కాండం మొత్తం ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉన్న అటిక మామిడి తీగ మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
అటిక మామిడి తీగలోని ఔషధ గుణాలు మన శరీరంలోని ప్రతి అవయవాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ముఖ్యంగా అటిక మామిడి తీగ కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచించడం జరిగింది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా,కిడ్నీలు పాడైపోయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చనని కొన్ని అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి.

అటిక మామిడి తీగ మొక్కను ఆకుకూరగా ఫ్రై చేసుకొని తినవచ్చు లేదా కషాయంగా చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తాజా అటిక మామిడి మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా తరిగి ఐదు లేదా పది నిమిషాలు 200 మి.లీ. నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడగట్టుకుని రసాన్ని మాత్రమే తీసుకొని ప్రతి రోజు ఉదయం పరగడపున 50 మి.లీ కషాయాన్ని తాగితే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.

Share your comments

Subscribe Magazine