Health & Lifestyle

మనం ఇంట్లో వాడే పుదీనాలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..!

KJ Staff
KJ Staff

మనం మన ఆరోగ్య బాగు కోసం, శరీర చర్మ సౌందర్యం కోసం ఎన్నో మందులు వాడుతుంటాం. అలా వాటిని వాడినంత వరకే మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ వాటిని ఒక్కసారి వాడకపోతే మళ్లీ మొదటికే వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని దూరం పెడుతూ.. మన ఇంట్లో నిత్యవసర వాడుకలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పైగా వాటిని కొంతవరకు వాడిన ఎంతో రిజల్ట్ ఉంటుంది. ఇక మన ఇంట్లో వంటలలో వాడే పుదీనాలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ గా బాగా పనిచేస్తాయి. అందులో చర్మానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మొటిమల నివారణ: చాలామందికి చర్మంపై మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటికోసం ఎన్నో క్రీమ్స్ వాడుతుంటారు. కానీ పుదీనాలో మాత్రం మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ ఉంటాయి. యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల పుదీనా ఆకుల పేస్ట్ ను ముఖానికి రాసుకొని 15 నిమిషాలు ఆరబెట్టి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మ గాయాల నివారణ: శరీరంపై బాగా గాయాలు అవుతుంటాయి. అవి మానడానికి కాస్త సమయం పట్టినా.. కొన్ని మచ్చలు మాత్రమే అలాగే ఉంటాయి. కాబట్టి పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఈ గాయాల నుండి బయట పడవచ్చు. పుదీనా ఆకుల రసాన్ని గాయాలపై రాసినచో మంచి ఫలితం ఉంటుంది.

హైడ్రేట్ చర్మం కోసం: చర్మం ముడతలు, గీతలు లేకుండా హైడ్రేట్ గా ఉంచటానికి పుదీనా ఆకులు బాగా సహాయపడుతాయి. చర్మ రంధ్రంలో ఉన్న మురికిని కూడా తొలగిస్తుంది. రక్త ప్రసరణకు బాగా తోడ్పడుతుంది. ఈ పుదీనా పేస్ట్ ను శరీరానికి అప్లై చేసిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నిమిషాల వరకు ఆరబెట్టి నీటితో శుభ్రం చేయడం వల్ల చర్మం సౌందర్యవంతంగా ఉంటుంది.

కళ్ళ చుట్టూ నల్లని వలయాలు: ప్రస్తుతం చాలా మంది కళ్ళకింద నల్లటి వలయాలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఇక వీటిని తగ్గించుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పుదీనా బాగా సహాయపడుతుంది. పుదీనా గుజ్జును కళ్ళకింద రాసి రాత్రంతా అలాగే పెట్టి ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రకాశవంతమైన చర్మం: చర్మం ప్రకాశవంతం కోసం పుదీనా ఆకుల రసం బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటంవల్ల నల్ల మచ్చలు, దద్దుర్లు వంటివి తొలగిపోతాయి. అంతేకాకుండా సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Share your comments

Subscribe Magazine