భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ, LIC బీమా రత్న అనే వ్యక్తిగత, పొదుపు జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ బీమా పాలసీలో చేరేందుకు కనీస వయసు 90 రోజులు కాగా.. గరిష్ట వయసు 50 ఏళ్లుగా ఉంది. ఈ పాలసీ తీసుకున్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కోరుకున్న విధంగా నెలకి లేక ఏడాది చొప్పున ఆర్థిక మద్దతు కూడా లభిస్తుంది. ఇది గ్యారెంటీ బోనస్‌ను అందించే మనీ బ్యాక్ పాలసీ.
ఈ పాలసీ లో ప్రీమియాలను తక్కువ కాల వ్యవధికే చెల్లించి, గ్యారెంటీ రిటర్నులను పొందవచ్చు. ఎల్ఐసీ బీమా రత్న పాలసీ 15 ఏళ్ల గడువుతో తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 5 ఏళ్ల నుంచి గరిష్ట వయస్సు 55 ఉండాలి. 20 ఏళ్లులేక 25 ఏళ్ల గడువుతో తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 90 రోజులుగా ఉండాలి. గరిష్ట వయస్సు 20 ఏళ్ల పాలసీకి 50 ఏళ్లు, 25 ఏళ్ల పాలసీకి 45 ఏళ్లు ఉండాలి. పాలసీ మెచ్యూరిటీ అయ్యే సమయానికి గరిష్ట వయస్సు 70 ఏళ్లు అవుతుంది.
డెత్ బెనిఫిట్:
రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత పాలసీ వ్యవధిలోపు జీవిత బీమా పొందిన వ్యక్తి మరణిస్తే "మరణంపై హామీ మొత్తం" అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125 శాతం లేదా వార్షిక ప్రీమియం కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
సర్వైవల్ బెనిఫిట్:
ప్లాన్ యొక్క కాలవ్యవధి 15 సంవత్సరాలు అయితే, LIC ప్రతి 13వ మరియు 14వ పాలసీ సంవత్సరం ముగింపులో ప్రాథమిక హామీ మొత్తంలో 25% చెల్లిస్తుంది. 20 సంవత్సరాల టర్మ్ ప్లాన్ కోసం, LIC ప్రతి 18వ మరియు 19వ పాలసీ సంవత్సరాల ముగింపులో ప్రాథమిక హామీ మొత్తంలో 25% చెల్లిస్తుంది. పాలసీ ప్లాన్ 25 సంవత్సరాలు అయితే, LIC ప్రతి 23వ మరియు 24వ పాలసీ సంవత్సరం చివరిలో అదే 25% చెల్లిస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments