Health & Lifestyle

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎలా?

KJ Staff
KJ Staff


మారుతున్న రోజులకు అనుగుణంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వ్యాధి భారిన పడి బయట పడిన వారికి ఇప్పుడు ఒక్కటిగా లక్షణాలు బయట పడుతున్నాయి. ఉన్నటుంది అనారోగ్యంపాలవడం, మరియు మరణించడం గురించిన వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. చాల మంది ప్రముఖులు కూడా ఆకస్మికంగా మరణిస్తున్నారు. ఇవన్నీ కోవిడ్ వల్లనేనని సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఆకస్మిక మరణాల్లో హార్ట్ ఎటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించే వారి సంఖ్య అధికంగా ఉంది.

ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువుగా ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో అధికంగా మరణించం కలకలం రేపుతోంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ప్రధానంగా గమనించవచ్చు. వీటిని గుర్తించి ముందుగానే చికిత్స తీసుకుంటే రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేక చాల మంది ముందుగా లక్షణాలు గుర్తించలేక దీనికి బాధితులుగా మారుతున్నారు.

అయితే చాల మందికి బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందన్న సందేహం ఉంటుంది. మనిషి శరీరంలో మెదడు అతిముఖ్యమైన భాగం. కొన్ని కారణాల వాళ్ళ మెదడుకు రక్తప్రసరణ జరగనున్న, మెదడుకు రక్తం నిలిచిపోయిన బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీని కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన ఉంటుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందుగానే లక్షణాలు గుర్తించి వైద్యం పొందగలిగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో శక్తీ తగ్గి, బలహీనంగా ఉన్నట్లు అనిపించడం దానితో పాటు, శరీరం అంత తిమ్మిర్లు వచ్చినట్లు మరియు మాట తడబాటం ఇవ్వని బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఉన్నటుంది స్పృహ కోల్పవడం, ఆలోచన సామర్ధ్యం తగ్గిపోవడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. దీనితో పాటు ద్రుష్టి లోపం, విపరితమైన తలనొప్పి, నిల్చోవడం మరియు నడవడంతో ఇబ్బంది, ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ కి ప్రధాన లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఎక్కువుగా ఉంటె ముందుగానే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine