ప్రస్తుత కాలంలో మైక్రో గ్రీన్ ఫుడ్ హవా పెరిగిపోయింది..ఏ సెలబ్రిటీల ఇంటిలో లో చూసిన మైక్రో గ్రీన్ ఫుడ్ కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ మైక్రో గ్రీన్ అంటే ఏమిటి..? ఈ విధమైన ఆహార పదార్థాలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? దీనిని ఏ విధంగా పండించాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మైక్రో గ్రీన్స్ ఫుడ్ అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే మొలకెత్తిన చిన్న మొక్కలని చెప్పవచ్చు. మనం విత్తనాలను చల్లిన వారానికి పెరిగే మొక్కలనే మైక్రో గ్రీన్స్ అని చెబుతారు.విత్తనాలు మొలకెత్తినప్పటినుంచి అవి మైక్రో గ్రీన్స్ గా ఏర్పడటానికి సుమారుగా ఏడు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు సమయం పడుతుంది. ఈ విధమైనటువంటి ఫుడ్డు లో కేవలం కాండం ఆకులు మాత్రమే ఎంతో ప్రయోజనకరం.
ఈ విధమైనటువంటి మైక్రో గ్రీన్స్ లోఅధిక మొత్తంలో పోషకాలు ఉండటం వల్ల చాలామంది ఈ ఫుడ్డుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఇంటిలో ఈ విధమైనటువంటి మైక్రో గ్రీన్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో వీటికి అధిక డిమాండ్ ఉండటం వల్ల వీటిని హోటల్ లో కూడా ఆహార పదార్థాలపై చల్లి ఇస్తున్నారు. ఇలాంటి ఆహారాన్ని ఇంటిల్లిపాదీ తినటం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు.
ఈ విధమైనటువంటి మైక్రో గ్రీన్ మన ఇంట్లో పండించుకోవడం ఎంతో సులభం సాగు చేయడానికి విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని చిన్న ట్రేలలో మట్టి నింపుకొని వాటిలో విత్తనాలు వేసుకొని కాస్త నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. అయితే ఈ మైక్రో గ్రీన్ మొలక రావాలంటే తప్పనిసరిగా సూర్యరశ్మి పడే విధంగా ఉండేలా చూసుకోవాలి.ప్రస్తుతం మార్కెట్లో 30 రకాల మైక్రోగ్రీన్ మొక్కలు లభ్యమవుతున్నాయి. ముల్లంగి, ఎర్ర ముల్లంగి, బ్రొకొలి, కాలిఫ్లవర్, క్యారెట్, పాలకూర, తోటకూర, క్యాబేజి, బీట్రూట్, తులసి, కొత్తిమీర, వాము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కీర దోసకాయ, బీన్స్, బఠానీ, మెంతి వంటివి అందుబాటులో ఉన్నాయి.
ఈ విధమైనటువంటి మైక్రో గ్రీన్ లో అత్యధికంగా క్యాల్షియం, మెగ్నీషియం జింక్ ఐరన్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫినాల్స్ అధికంగా లభిస్తాయి. ఈ విధంగా మైక్రో గ్రీన్ తినడం వల్ల మధుమేహం క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు అయితే పోషకాలు మెండుగా ఉన్నాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Share your comments