వేసవి కాలం వచ్చిందంటే సోడాలకు కూల్ డ్రింకులకు గిరాకి అధికంగా పెరిగిపోతుంది. ఎండవేడి నుండి కాపాడుకోవడానికి చల్లని పానీయాలు ఎక్కువుగా తీసుకుంటాము. వీటిలో ఐస్ క్రీములు, జ్యూస్స్ లు, కొబ్బరిబోండాలు, మరియు కొబ్బరిబోండాలు ముఖ్యమైనవి. మార్కెట్లో కూల్ డ్రింకులు మిగిలిన పానీయాలతో పోలిస్తే కాస్త తక్కువ ధరకు లభిస్తాయి కనుక ప్రజలు వీటిని తాగేందుకు మొగ్గుచూపుతారు, ఇక సోడాలు గురించి చెప్పనవసరంలేదు. అయితే వీటిని ఎక్కువ తాగడం అంత మంచిదికాదని వైధ్యులు సూచిస్తారు.
సోడాలు లేదా కూల్ డ్రింక్స్ అధికంగా తాగేవారిలో పళ్ళు పలచబడతాయి. పళ్ళ మీద ఉండే ఎనామిల్ అనే పదార్ధం కరిగిపోవడం ద్వారా పళ్ళు బలహీనపడి రంగు మారడం గమనించవచ్చు. ఇదే కొనసాగితే కొంత కాలానికి పళ్ళు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాల్ డ్రింక్స్ లో చెక్కర శాతం అధికంగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీపీ మరియు డయాబెటిస్ సమస్యలు ఎక్కువుగా వస్తాయి.
తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారిలో గుండెకు సంభందించిన రోగాలు ఎక్కువయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిని అధికంగా తాగేవారిలో కిడ్నీల పై ఒత్తిడి పడి కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ ఉండే కొన్ని కెమికల్స్ కారణంగా ఎముకలు మెత్తబడి బలహీనంగా తయారవుతాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కూల్ డ్రింక్స్ తాగడం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా ఒకటి లేదా రెండు తాగితే అంత ప్రమాదం ఉండకపోవచ్చు కానీ తరచూ తాగేవారిలో ఆనారోగ్య సమస్యలు తలైతే అవకాశం ఎక్కువ.
Share your comments