Health & Lifestyle

రోజంతా ఫ్రెష్ గా ఉండటానికి ఈ డ్రింక్ ట్రై చెయ్యండి......

KJ Staff
KJ Staff

వేసవి కాలంలో వీలైనంత ఎక్కువ సార్లు నీరు తాగమని వ్యాధులు సూచిస్తారు. నిజానికి నీరు ఆరోగ్యకరమైన, ఎటువంటి రుచి లేని నీటిని తాగడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అదే నీటిని కొన్ని పదార్ధాలు కలపడం ద్వారా రుచిగాను, ఆరోగ్యంగాను మార్చవచ్చు.


చాలామంది ఎండ వేడి వల్ల కలిగే దాహం నుండి కాపాడుకోవడానికి, మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతారు. అయితే ఇవి ఆరోగ్యాన్ని హానికలిగించవచ్చు, అయితే కూల్ డ్రింక్స్ కి ప్రత్యమన్యంగా ఇంటి వద్దే రుచికరమైన సహజసిద్దమైన సూపర్ డ్రింక్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రింక్ తయారు చెయ్యడానికి నానబెట్టిన సబ్జా గింజలు, తేనే, నిమ్మరసం, బీట్రూట్ రసంతో ఎంతో రుచికరమైన హెల్తి రెఫ్రెషింగ్ డ్రింక్ ఇంటివద్దే సిద్ధం చేసుకోవచ్చు. పైన చెప్పిన పదార్ధాలు అన్ని చల్లని నీటిలో కలిపి తీసుకొవడం ద్వారా, రోజంతా ఫ్రెష్ మరియు హైడ్రాటెడ్ గా ఉంటారు. ఆసక్తి ఉన్నవారు ఈ డ్రింక్ లోనే చిటికెడు నల్ల ఉప్పు, చాట్ మసాలా కలుపుకుని తాగవచ్చు.

ఈ డ్రింక్ తాగడం వలన శరీరానికి అవసరమైన నీటితో పాటు, కొన్ని పోషకాలు కుడా లభిస్తాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు, నీటిని పీల్చుకుని, ఆ నీటిని శరీరంలోకి క్రమంగా విడుదల చేస్తాయి, అంతేకాకుండా వీటిలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇంకా నిమ్మ రసంలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-సి లభిస్తుంది. విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, ఈ వేసవి కాలంలో రోగాల నుండి మనల్ని కాపాడుతుంది. బీట్రూట్లో విటమిన్-ఏ,సి,కే, తో పాటు శరీరానికి ఎంతో అవసరమైన మాంగనీస్, పొటాషియం అందుతాయి, ఇవి అధిక బ్లడ్ ప్రెషర్ నియంత్రించడంలో తోడ్పడతాయి. చివరిగా తేనే ఈ డ్రింక్ కి సహజసిధమైన తియ్యదనాన్ని అందిస్తుంది. తేనెలో ఉండే యాంటియోక్సిడెంట్, యాంటీబాక్టీరియల్ గుణాలు రోగాల భారిన పడకుండా మనల్ని కాపాడతాయి.

Share your comments

Subscribe Magazine