Health & Lifestyle

ఈపిఎఫ్ అకౌంట్ లో మార్పులు...ఇలా చేయకపోతే డబ్బులు రావు!

S Vinay
S Vinay

ఎంప్లాయీస్‌ ప్రొవిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (Employees' Provident Fund Organisation) లో నూతన మార్పులు వచ్చాయి. ఇవన్నీ సక్రమంగా పూర్తి చేస్తేనే మీరు మీ సంబంధిత PF అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోగలరు.

ఒకప్పుడు PF డబ్బు పొందాలంటే EPFO కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది కానీ ఇప్పుడు మీ ఇంటి వద్దే మీ మొబైల్ ద్వారా డబ్బును పొందవచ్చు అయితే ఇప్పుడు ఇందులో కొన్ని మార్పులు వచ్చాయి. మీ PF అకౌంట్ ప్రొఫైల్ లో మీ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో మీ డబ్బును విత్ డ్రా చేయలేరు.

ఫోటో అప్ లోడ్ చేయడం ఎలా?
ముందుగా మీ UAN ID మరియు PASSWORD ఉపయోగించి అకౌంట్ లోకి లాగిన్ అవ్వగలరు.

తర్వాత మెను (MENU) సెక్షన్ లో ప్రొఫైల్ కి వెళ్లి అందులో మీ ఫోటో ని అప్ లోడ్ చేయగలరు.

మీరు ఇప్ లోడ్ చేసే ఫోటో స్పష్టంగా ఉండేలా చూసుకోండి.

PF అమలులో జాప్యం జరుగుతుందా అయితే బ్యాంకులు మీకు అదనంగా డబ్బు చెల్లించాల్సిందే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, పెన్షన్ లేదా బకాయిలు పంపిణీ చేయడంలో ఏదైనా జాప్యం జరిగినప్పుడు, పెన్షనర్‌కు సంవత్సరానికి 8 శాతం చొప్పున పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు పరిహారం చెల్లించాలి. ఈ డబ్బు లబ్ధిదారుల బ్యాంక్‌కు జమ చేయబడుతుంది.పింఛను లేదా బకాయిలను పంపిణీ చేయడంలో ఏదైనా జాప్యం జరిగినప్పుడు, పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు
వినియోగదారునికి సంవత్సరానికి 8 శాతం చొప్పున పరిహారం చెల్లించాలని RBI నియమాలు ఆదేశించాయి.

మరిన్ని చదవండి.

కిసాన్ క్రెడిట్ కార్డు లాభాలు...దరఖాస్తు చేయడం ఎలా?

అటల్ పెన్షన్ యోజన ఏమిటి ? ఎవరు అర్హులు ..

Related Topics

epfo rbi provident fund

Share your comments

Subscribe Magazine