Health & Lifestyle

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా?.. అయితే జాగ్రత్త

KJ Staff
KJ Staff

కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రతరం అవుతున్న క్రమంలో చాలా కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం బాట పడుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గడంతో కొన్ని కంపెనీలు ఇటీవల ఆఫీసులను తిరిగి ప్రారంభించాయి. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో.. వర్క్ ఫ్రం హోంను అమలు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా హ్యాపీగా ఫీలవతున్నారు.

అయితే కరోనా క్రమంలో వర్క్ ఫ్రం హోం మంచిదే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వర్క ఫ్రం హోం సజావుగా కొనసాగించవచ్చు.

ఎక్కువసేపు పోశ్చర్‌లో కూర్చోని, ప్రతిరోజూ మంచంపై దిండుని ఉపయోగించి వర్క్ చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకావముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మంచం కేవలం నిద్రపోవడానికి ఉపయోగించాలి. అక్కడే కూర్చోని వర్క్ చేయడం ద్వారా నిద్ర మీద ప్రభావం చూపుతుంది. అందుకే మంచం మీద కూర్చోని వర్క్ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఒక టేబుల్ మీద కూర్చోని వర్క్ చేయాలని, మధ్యమధ్యలో లేస్తూ నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.

మంచం మీద కూర్చోని వర్క్ చేయడం వల్ల భుజాలు, మెడ మీద ఒత్తిడి పడుతుంది. దీని వల్ల నొప్పులు వస్తాయని, నడుము, పొట్టని వంచి పనిచేయడం వల్ల నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల నిద్ర నాణ్యత కూడా తగ్గుతుందంటున్నారు. అలాగే చీకటిగా ఉండే గదిలో పనిచేయడం వల్ల కళ్లపై ప్రభావం పడుతుందని, సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలని చెబుతున్నారు.

కిటికీలు ఉన్న ప్రదేశంలో కూర్చోని వర్క్ చేయాలని, వెలుతురు పడేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం లేచి బెడ్ మీద కూర్చోని వర్క్ చేయడం వల్ల బద్దకం వస్తుందని, పని కూడా చేయలేరని వైద్యులు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒకసారి లేచి బ్రేక్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇవన్నీ పాటిస్తే వర్క్ ఫ్రం హోం సజావుగా సాగుతుందని, లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

Share your comments

Subscribe Magazine