Health & Lifestyle

వర్షంలో తడుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

KJ Staff
KJ Staff
RAIN
RAIN

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎండాకాలం పోయి వర్షకాలం రావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వల్ల అనేక సీజనల్ వ్యాధులు వస్తాయి. వాతావరణంలో మార్పులు వల్ల మన శరీరంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. సీజన్‌ను బట్టి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఏ సీజన్ లో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఆ సీజన్ లో తీసుకోవాలి. ఎండాకాంలో వడదెబ్బ బారిన పడుతూ ఉంటాం. వర్షాకాలంలో జ్వరం, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి.

అయితే చాలామందికి వర్షంలో తడిచే అలవాటు ఉంటుంది. వర్షంలో తడిచి సరదా పడుతూ ఉంటారు. కానీ వర్షంతో తడవడం వల్ల అనేక చర్మ సమస్యలు కూడా వస్తాయి. వర్షాకాలం ముఖ్యంగా చర్మ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెచ్చని నీటితో స్నానం

వర్షాకాలం బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల రోజూ వేడినీళ్లతో స్నానం చేయడం మంచిది. శరీరంపై ఉండే బ్యాక్టీరియా దీని ద్వారా చచ్చిపోతాయి. ఇక వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.

మేకప్ వేసుకోకపోవడం మంచిది

వర్షాకాలంలో మొఖానికి మేకప్ వేసుకోకపోవడం మంచిది. వర్షాకాలంలో మేకప్ వేసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. వర్షం పడటం వల్ల మేకప్ మొత్తం చెడిపోతుంది. దీని వల్ల మేకప్ శరీరంలపై పేరుకుపోయి నష్టం జరుగుతుంది. వాటర్ ఫ్రూప్ప మేకప్ వాడటం మంచిది.

చర్మం పొడిబారకుండా..

ఇక వర్షాకాలంలో బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీని నుంచి బయట పడాలంటే రెగ్యూలర్ గా మాయూశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి.

షూస్, సాక్స్ వాడకండి

ఇక వర్షాకాలంలో షూస్, సాక్స్ వాడటం చాలా ప్రమాదకరం. నీళ్లు షూస్, సాక్స్ లోకి వెళతాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంటుంది.

వేడినీళ్లు

ఇక వర్షాకాలంలో నీళ్లు కాలుష్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే గొరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. అలాగే బయటి నుంచి వచ్చిన తర్వాత గోరు వెచ్చని నీటితో కాళ్లను కడుక్కోవాలి. ఇక వారానికొకసారైనా ఒంటికి కొబ్బరి నూనె రాసి పెసర లేదా సెనగ పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. అలాగే రోజూ అరచెక్క నిమ్మరసాన్ని పిండిన గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

-ఇక వర్షాకాలంలో మెటిమలు, మచ్చల సమస్య ఎక్కువగా ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్లన మెటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇక రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ వాటర్, కలబంద లేదా యాపిల్ సిడార్ వెనిగర్‏ను మృదువుగా అప్లై చేయాలి.


-అలాగే చర్మంపై టోనింగ్ చేయడానికి పాలు, నిమ్మరసం, కీరదోస రసం లేదా గ్రీన్ టీ ఏదోకటి రాస్తూ ఉండాలి. మృత కణాల బెడద కూడా తగ్గుతుంది. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి సులువుగా బయపడవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine