బస్సులో ప్రయాణిస్తున్నపుడు లేదంటే ఏమైనా పనిచేస్తున్నప్పుడు, ఉన్నటుంది పొట్ట పట్టేసినట్టుగా ఉంది, గ్యాస్ బయటకు వస్తుంది, ఈ పరిస్థితిలో పక్కవారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. గ్యాస్ సమస్య రావడానికి అనేక కారణాలున్నాయి, అయితే ఆహార నియమాలు సరిగ్గ పాటించని వారిలో ఈ సమస్య ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో ఆహారం తినడం అనేది ప్రధాన నియమం కానీ నేటి ఉరుకులుపరుగులతో కూడిన జీవితంలో ఈ నియమాన్ని పాటించడం కష్టమవుతుంది. ఇలా రోజు ఒకే సమయానికి ఆహారం తిననందువల్ల జీర్ణక్రియ పాడై, కడుపులో గ్యాస్ తయారయ్యే అవకాశం ఉంటుంది.
ఆహార నియమాలు సరిగ్గా పాటించని వారితో పాటు, మలబద్దకం, విరోచనాలు ఉన్నవారిలో కూడా గ్యాస్ తయారవవుతుంది. ఇది పేగుల్లో ఇబ్బంది కలిగించి, నొప్పి కలిగేలా చేస్తుంది. గ్యాస్ తయారవ్వడం అనేది సహజసిద్దమైన ప్రక్రియ, అన్ని ప్రాణుల్లోనూ గ్యాస్ తయారవుతుంది. కానీ ఏది ఎక్కువ తయారైతేనే సమస్య ఉంటుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్ లో ప్రాణవాయువుతో పాటు ఇతర వాయువులు కూడా కలిసి ఉంటాయి. అయితే గ్యాస్ తయారీని అడ్డుకోలేం కానీ ఆహారంలో మార్పులు తీసుకోవడం ద్వారా ఎక్కువుగా గ్యాస్ ఉత్పత్తి జాగరకుండా నియంత్రించవచ్చు.
ముందుగా గ్యాస్ ఉత్పత్తి ఎక్కువు కావడానికి కారణమయ్యే ఆహార పదార్ధాలను తినడం కాస్త తగ్గించాలి. వీటిలో బీన్స్, శనగపిండితో చేసిన ఆహారం, ఉల్లిపాయలు, గోధుమపిండి వంటివి ప్రధానమైనవి. జంక్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ పదార్ధాలు తక్కువుగా తినడం మంచిది, ఫ్రైడ్ ఆహారంలో ఉండే కొవ్వు పదార్ధాలు జీర్ణాశయంలో ఎక్కువసేపు కదలకుండా గ్యాస్ పెరగడానికి కారణమవుతాయి. వైద్యులు సూచించే దాని ప్రకారం, ఆహారం ఎప్పుడు తక్కువ మోతదులో ఎక్కువ సార్లు తినాలి, అంటే మనం ఒకసారి తినే అన్నన్ని రెండు, మూడు భాగాలుగా విభజించి తినడం మంచింది, ఇలా తినడం ద్వారా పొట్టకి ఆహారని అరిగించడానికి సమయం లభిస్తుంది. వీటితోపాటు మానసిక ఆందోళనలు, ఒత్తిడి వీలైనంత తగ్గించుకోవడం మంచింది. ఒత్తిడి వలన కూడా ఉదర సంబంధిత సమస్యలు తలైతే అవకాశం ఉంది.
Share your comments