Health & Lifestyle

రెడ్ మీట్ తింటున్నారా.. అయితే జాగ్రత్త గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది..?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో కొందరికైతే ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారు జాగ్రత్త సుమా. మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రయోజనాల కంటే దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. చికెన్ ,మటన్ ,ఫిష్ ,ఫ్రాన్స్ ఇలా మాంసాహారంలో రెండు రకాల మాంసాహారాలు ఉంటాయి.అయితే వీటిలో రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాల మాంసాహారాలు ఉన్నాయి. వీటిలో దేనిని తినటం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం...

వైట్ మీట్ అంటే చికెన్ ,ఫిష్ ,ఫ్రాన్స్ మొదలైనవి. రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, ఫోర్క్ లాంటివి. ముఖ్యంగా ఈ రెడ్ మీట్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రెడ్ మీట్ లో ప్రోటీన్ తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
న్యూ5జిసి చక్కెర ఉత్పత్తి చేసే కొన్ని జంతువులు మరియు చేపలను తినటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.రెడ్ మీట్ ఎక్కువగా తినటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

అదేవిధంగా రెడ్ మీట్ లో ఉండే ఫ్యాట్ వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాలో నుంచి రక్తం గుండెకు చేరకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చి అవకాశం ఉంది.మటన్ ,బీఫ్ ,ఫోర్క్ వంటి మాంసాహారం తినటం వల్ల వాటిలో ఉండే కొలెస్ట్రాల్ ద్వారా మధుమేహం వచ్చె అవకాశం ఉంది. కేవలం కొలెస్ట్రాల్ కాకుండా ఆవు, ఎద్దు, గొర్రె వంటి జంతువుల మాంసాలలో కర్నిటేన్ అనే పదార్థం ఉంటుంది. అది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోయేలా చేస్తుంది. దానివల్ల గుండె జబ్బులు వస్తాయి.

Share your comments

Subscribe Magazine