Health & Lifestyle

SBI customers alert! మార్చి 28-29 బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె !

Srikanth B
Srikanth B

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ  చట్టాలకు , బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా వివిధ ఉద్యోగుల సంఘాలు మార్చి 28-29 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

వివిధ ఉద్యోగుల సంఘాలు మార్చి 28-29 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినందున బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడవచ్చని దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

"బ్యాంకు సమ్మె రోజులలో తన శాఖలు మరియు కార్యాలయాలలో సాధారణ పనితీరుకు   అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, సమ్మె కారణంగా మా బ్యాంకులో పని పరిమిత స్థాయిలో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది" అని SBI తెలిపింది. సమ్మె కారణంగా ఏర్పడే నష్టాన్ని లెక్కించలేమని SBI  బ్యాంక్‌ పేర్కొంది.

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA)  లు దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించాయి అయితే సమ్మెను చేపట్టకుండా  నోటీసులు అందజేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సూచించినట్లు SBI తెలిపింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ చర్య కు వ్యతిరేకంగా , బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021ని వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో గ్రామీణ మహిళల దూకుడు. (krishijagran.com)

Share your comments

Subscribe Magazine