Health & Lifestyle

కరోనా వ్యాక్సిన్లు: కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవేనట

KJ Staff
KJ Staff
corona vaccine
corona vaccine

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. అన్ని దేశాలు తమ దేశ ప్రజలకు వేగంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసుకోవడంతో పాటు డిమాండ్ కారణంగా వేరే దేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నాయి. చాలా దేశాలు ఇప్పటికే దాదాపు 80 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వగా.. మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్ వ్యాక్సిన్ బాగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి. తొలి వేవ్ లో వచ్చిన ఆల్ఫా వేరియంట్, సెకండ్ వేవ్ లో వచ్చిన డెల్టా వేరియంట్లను వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.

ఇది ఇలా ఉంటే, ఇండియాలో ప్రధానంగా రెండు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కొవాగ్జిన్ కాగా.. ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీతో కలిసి పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్. ఇక స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ఇండియాలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

మరో కొద్దినెలల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులోకి రానుంది. అయితే ప్రతి మందుకూ సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్లుగానే కరోనా వ్యాక్సిన్ కు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వ్యాక్సిన్ కు ఒకలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాంజ

కోవిషీల్డ్: జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది ఈ రెండు లక్షణాలు స్వల్పంగా కనిపించాయి.

ఇక కొవాగ్జిన్ తీసుకున్నవారిలో తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తున్నాయి. ఇక స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి.

వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

-వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కరోనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కరోనా సోకిన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం ప్రమాదకరం
-కరోనా లక్షణాలు ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకూడదు.
-వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొద్దిరోజులపాటు పోష్టికాహరం తీసుకోవాలి.
-తొలి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్ ఉండాలి
-కరోనా సోకి కోలుకున్న వాళ్లు వెంటనే తీసుకోకూడదు. మూడు నెలల తర్వాత తీసుకోవాలి.
-బీపీ పేషెంట్స్ వ్యాక్సిన్ వేయించుకోకముందు బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ170/180 మధ్య ఉంటే కాసేపు అక్కడే కూర్చుని, బీపీ తగ్గాక వ్యాక్సిన్​ వేయించుకోవాలి.
-షుగర్​ పేషెంట్స్​ కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకునే రోజు కూడా ఇన్సులిన్​ తీసుకోవాలి
-డాక్టర్​ సలహాతో క్యాన్సర్​ పేషెంట్స్​ వ్యాక్సిన్​ తీసుకోవాలి
-అలర్జీలతో బాధపడుతున్నవాళ్లు కూడా కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine