Health & Lifestyle

అరచేతిలో చర్మం రాలిపోతోందా... ఈ సమస్యకు ఇలా చెక్ పెట్టండి!

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో చాలా మందిని వెంటాడుతున్న సమస్యలలో చర్మ సమస్యలు ఒకటి. చర్మ సమస్యలు చిన్నదే అయినప్పటికీ దానివల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇలాంటి చర్మ సమస్యలలో అరచేయి అరికాళ్లలో చర్మం రాలిపోతున్న సమస్య ఒకటని చెప్పవచ్చు.ఈ సమస్య కేవలం చిన్న పెద్ద అని మాత్రమే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెంటాడుతుంది. అయితే ఇలాంటి సమస్య చర్మంపై ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా లేదా ఇతర సమస్యల వల్ల ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏ విధంగా ఈ సమస్యకు చెక్ పెట్టాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

చాలామంది గంటల తరబడి స్నానాలు చేస్తుంటారు.అయితే మనం స్నానం చేసే సమయాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవడం ఎంతో ఉత్తమం.ఎక్కువ సేపు తేమ మన చేతులకు తగలటం వల్ల చేతులపై చర్మం ఉబ్బుకొని చర్మం రాలిపోయే ప్రమాదం ఉంది.అలాగే చిన్న పిల్లలు బయట ఆడుకునే సమయంలో ఎక్కువగా బ్యాక్టీరియా శిలీంధ్రాలు వ్యాపించి ఉన్న ఉపరితలాలపై అడ్డుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ తలెత్తుతాయి. ఈ విధంగా పిల్లలు బయట ఆడుకుని వచ్చినప్పుడు వెంటనే శుభ్రంగా కాళ్లు చేతులు కడగటం ఎంతో ఉత్తమం.

చిన్నపిల్లలలో ఈ విధమైనటువంటి సమస్య రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గదిలో హ్యూమిడిఫైయర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది శరీరంలో తేమను పెంచడంతోపాటు చర్మంలో పొడి నివారించడంలో తోడ్పడుతుంది.అలాగే చాలా మందికి బట్టలు ఉతికేటప్పుడు అధిక గాఢత కలిగిన డిటర్జెంట్ ను ఉపయోగించడం వల్ల కూడా ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. వీలైనంతవరకు తక్కువ గాఢత కలిగిన సబ్బులు ఉపయోగించడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఈ సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.

Share your comments

Subscribe Magazine