Health & Lifestyle

మొలకెత్తే కాగితాలు.. ఎలానో తెలుసా?

KJ Staff
KJ Staff

ఏంటి..? మొలకెత్తే కాగితాలా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ! సాధారణంగా మనం విత్తనాలు మొలకెత్తడం చూశాము కానీ కాగితాలలో విత్తనాలు మొలకెత్తడం గురించి అసలు చూడటం కాదు కదా.. విని కూడా ఉండము. అయితే కాగితాలు కూడా మొలకెత్తుతాయని నల్గొండ పట్టణానికి చెందిన ప్రకృతి ప్రేమికురాలు జ్యోతక్క నిరూపించారు. అసలు ఈ మొలకెత్తే కాగితాలు అంటే ఏమిటి వాటిని ఎలా తయారుచేస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

సాధారణంగా ప్రతి రోజూ మనం మన ఇంట్లో ఎన్నో వ్యర్థపదార్థాలను బయట పడేస్తూ ఉంటాము.అయితే సరైన ఆలోచన చేస్తే ఎన్నో వ్యర్థ పదార్థాల నుంచి ఉపయోగపడే వస్తువులను తయారు చేసుకోవచ్చని జ్యోతక్క నిరూపించారు. ఈమెకు పెళ్లి కాకముందే ఈ విధమైనటువంటి వస్తువులను తయారుచేయడం అలవాటుగా ఉండేది.ఈ క్రమంలోనే ఎంతో మందికి ఇలాంటి కుట్లు ,అల్లికలు ,బొమ్మలు తయారు చేయడం గురించి శిక్షణ ఇచ్చారు.

తాజాగా వృధాగా ఉన్న పేపర్లతో మొలకెత్తే కాగితాలను కూడా తయారుచేసి మరోసారి తను ఏంటో నిరూపించుకున్నారు. సాధారణంగా మన ఇంట్లో వివిధ రకాల కూరగాయ తొక్కలను పడేస్తుంటారు. అయితే ఆ తొక్కలను ఉపయోగించి కాగితాల ద్వారా విత్తనాలను మొలకెత్తించవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మనం కొత్త మొక్కలను సృష్టించడమే కాకుండా మన ఇంట్లో చెత్త లేకుండా చేసుకోవచ్చు. అయితే మరి ఈ సీడ్ పేపర్ లు ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం...

ముందుగా మన ఇంట్లో లభించే కూరగాయల వ్యర్థ పదార్థాలను తీసుకొని వాటిని మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా తయారు చేయాలి. ఈ గుజ్జును ఒక టిష్యూ పేపర్ పై వేసే పేపర్ మొత్తం అంటించాలి. ఈ పేపర్ పై మనం విత్తనాలను చల్లి ఆ తర్వాత వాటి పై మరొక టిష్యూ పేపర్ వేయాలి. ఈ టిష్యూ పేపర్ గట్టిగా ఆరిన తరువాత మట్టి పైపొరను తీసి ఈ కాగితాన్ని మట్టిలో పూడ్చాలి దానిపై ఇంకోసారి మట్టి వేసి నీళ్లు చల్లాలి. ఈ విధంగా రెండు రోజులపాటు నీరు పోయడం వల్ల ఆ కాగితం నుంచి మనకు మొలకలు బయటకు వస్తాయి. ఈ విధంగా కాగితపు మొలకలను మన బంధువులకు, స్నేహితులకు కానుకగా ఇవ్వవచ్చు.

Share your comments

Subscribe Magazine