Health & Lifestyle

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా.. గుమ్మడి రసంతో చెక్ పెట్టండిలా!

KJ Staff
KJ Staff

భారతీయ ఆయుర్వేద వైద్యంలో బూడిద గుమ్మడికాయకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అందుకే దీన్ని వైద్య కుష్మాండం, వైద్య కంబళం అని పిలుస్తారు.బూడిద గుమ్మడి కాయలోను, విత్తనాల్లోనూ, మొక్క తీగలోనూ మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఔషధ గుణాలు, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే బూడిద గుమ్మడి కాయతో రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు.ముఖ్యంగా గుమ్మడి హల్వా ,గుమ్మడి వడియాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన, ఔషధగుణాలు ఉన్న బూడిద గుమ్మడి కాయను ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం!.

బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి,బి,ఈ, కార్బొహైడ్రేట్లు,యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటంతో మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది. అలాగే బూడిద గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నియంత్రించి మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గం చూపుతుంది. బూడిద గుమ్మడి తీగ రసాన్ని హైబీపి, నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది

బూడిద గుమ్మడి విత్తనాలలోని ఔషధ గుణాల కారణంగా వీటినుంచి తీసిన నూనె చర్మవ్యాధుల నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుంది.బరువు అధికంగా ఉన్నవారికి గుమ్మడి మంచి ఆహారం అని చెప్పవచ్చు. శరీరంలో కేలరీలను అద్భుతంగా తగ్గిస్తుంది. అలాగే చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ప్రతి రోజు గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మన శరీరం చల్లబడటంతో పాటు,అధిక రక్తపోటు,నిద్రలేమి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

Share your comments

Subscribe Magazine