Health & Lifestyle

షుగర్ పేషెంట్స్: ఇవి తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందట

KJ Staff
KJ Staff

షుగర్.. మనం ఈ పదాన్ని ఎక్కడో ఒకచోట తరచూ వింటూ ఉంటాం. మన బంధువుల్లోనే ఎవరో ఒకరికి ఈ వ్యాధి ఉండే ఉంటుంది. ఇండియాలో చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు పలు అధ్యయనా ల్లో తేలింది. ఒకప్పుడు 50 సంవత్సరాల పైన వయస్సు గల వాళ్లు ఈ వ్యాధి బారిన పడేవాళ్లు. కానీ ఇప్పుడు మధ్య వయస్సులో ఉన్నవారు కూడా షుగర్ వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. దాని శాతాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టతరమవుతుంది.

తీపి పదార్థాలు పూర్తిగా మానేయాల్సి వస్తుంది. ఆరోగ్య నియమాల్లో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే షుగర్ ను కంట్రోల్ లోకి తీసుకురావవడానికి సూపర్ పుడ్స్ బాగా ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం

బెర్రీస్

బెర్రీస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ వీటి నుంచి లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధులతో పోరాడే శక్తిని ఇవి అందిస్తాయంటున్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో ఇవి చాలా ఉపయోగపడతాయంటున్నారు. అలాగే కేన్సర్, హార్డ్ డిసీజ్ ముప్పు తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు.

పప్పులు

పప్పులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు విటమిన్ బీ, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పాలీఫెనాలిక్ పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు చేకూరుస్తాయి. క్యాన్సర్, గుండెజబ్బుల రాకుండా గ్రీన్ టీ కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, పాలీ ఫెనాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. దీని వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

ముదురాకు పచ్చని ఆకులు

ముదురాకు పచ్చని ఆకులు విటమిన్ సీ, జింక్, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల రిస్క్ ని తగ్గించగలవు. పాలకూర, టర్నిప్ గ్రీన్స్, కొలార్డ్ గ్రీన్ అనే రకాలు ఆకు కూరల్లో ఉన్నాయి.

 

 

Share your comments

Subscribe Magazine