Health & Lifestyle

క్యాన్సర్, షుగర్ ని తరిమికొట్టే చిలగడ దుంపలు?

KJ Staff
KJ Staff

సాధారణంగా దుంపలలో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పిస్తాయని మనం ఇదివరకు తెలుసుకుంన్నాం అయితే దుంప జాతికి చెందిన చిలగడదుంపలలో ఎన్నో ఔషధ విలువలు కలిగినటువంటి రెండు సరికొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అవి ఒకటి ఉదారంగు చిలగడదుంపలు, నారింజ రంగులో ఉండే చిలగడదుంపలు.

ఒడిశాలోని కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్‌ఐ) గత ఏడు సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటి వంగడాల పై పరిశోధనలు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. మరి ఈ కొత్తరకం వంగడాలను ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఊదా రంగులో ఉన్నటువంటి చిలకడదుంపలలో 100 గ్రా. దుంపలో 90_100 గ్రాముల ఆంథోశ్యానిన్‌ వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది మన శరీరంలోని క్యాన్సర్, రక్తంలోని చక్కెర నిల్వలను అదుపు చేయడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఈ విధమైనటువంటి వంగడంలో అధిక మొత్తంలో ఉన్నాయని,వీటిని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని ఈ సందర్భంగా సిటిసిఆర్‌ఐ అధిపతి డా. ఎం. నెడుంజెళియన్‌ చెప్పారు. 

అదేవిధంగా 100 గ్రా.నారింజ చిలగడదుంపలలో 14 ఎంజిల బీటా–కెరొటిన్‌ ఉందని, ఈ విధమైనటువంటి చిలగడ దుంపలను క్యారట్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. ఈ విధమైనటువంటి వంగడాలను సాగు చేయడానికి 100 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. ఈ విధమైనటువంటి చిలగడదుంపలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలను నశింపజేసే చేయడమే కాకుండా మనలోని చక్కెర నిల్వలను అదుపుచేయడానికి పూర్తిగా దోహదపడటం వల్ల ఈ వంగడాలకు అధిక ప్రాధాన్యత దక్కిందని ఈ సందర్భంగా . ఎం. నెడుంజెళియన్‌ చెప్పారు. 

Share your comments

Subscribe Magazine