Health & Lifestyle

పండ్ల రాణి మాంగొస్టీన్, దానిలోని పోషక విలువలు

KJ Staff
KJ Staff
Mangosteen
Mangosteen
ఉష్ణమండల పండ్లలో రాణిగా పేరు పొందిన  మాంగోస్టీన్ ఆగ్నేయ ఆసియాలో అతి సాధారణంగా పండే పంట. ఇండోనేషియా లో ఇది ఒక సంప్రదాయ పంట. మన దేశంలో తమిళనాడు లోని నీలగిరి, కన్యాకుమారి జిల్లాల్లో, కర్ణాటక లోని దక్షిణ కన్నడ, కొడగు జిల్లాల్లో మరియు కేరళలోని చాలా ప్రాంతాల్లో అక్కడి రైతులు ఈ మాంగోస్టీన్ పంటను చాలా విజయవంతగా పండిస్తున్నారు.
మాంగోస్టీన్ ఒక సతత హరిత వృక్షం. ఇది చూడడానికి  చాలా చిన్నదైన పండు. అన్ని కాయల్లాగే కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు పండు దశకు వచ్చేటప్పటికి ముదురు ఊదా రంగులోకి మారుతుంది. ఈ పండులోపల తెల్లని మృదువైన గుజ్జు  ఉంటుంది. ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఇది తిన్నప్పుడు ఒక తాజా అనుభూతి కలుగుతుంది.

మాంగోస్టీన్లో పోషక విలువలు:

మాంగోస్టీన్‌లో చక్కెర నిలువలు అధికంగా ఉంటాయి, ఇది హైపోగ్లైసీమిక్ రోగులకు చాలా అనువైన పండు.  అధిక మొత్తంలో శక్తి, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది మనకు ఒక చక్కటి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆరోగ్య వనరు. అధిక మొత్తంలో ఫ్లేవోన్లు, జాన్తోన్లు మరియు యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ల ఉండటం వల్ల ఇది ఒక చక్కని ఆరోగ్యకరమైన, సంపూర్ణమైన ఆహారంగా మారింది.

ఒక కప్పు మాంగోస్టీన్ పండు గుజ్జులో

• కేలరీలు - 143
• ఫైబర్ -3.5 గ్రా.
• పిండి పదార్థాలు - 35 గ్రా.
• ప్రోటీన్ - 1 గ్రా.
• కొవ్వులు - 1 గ్రా.
• మెగ్నీషియం - 6% RDI
• మాంగనీస్ - 10% RDI
• రాగి - 7% RDI
•విటమిన్ సి: 9% RDI
•విటమిన్ బి 9 (ఫోలేట్): 15% RDI
•విటమిన్ బి 1 (థిథియామిన్): 7% RDI
•విటమిన్ బి 2 (రిబోఫ్లేవిన్): 6% RDI
RDI : Refence Daily Intake
కేలరీలు తక్కువగా ఉన్నప్పుడు మాంగోస్టీన్ వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లను అందిస్తుంది. మీ శరీరంలో అనేక విధులను నిర్వహించడానికి ఈ పోషకాలు ముఖ్యమైనవి.మాంగోస్టీన్లోని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు సూర్యరశ్మి మరియు వృద్ధాప్యంతో సంబంధం ఉన్న చర్మ కణాలను రక్షించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Related Topics

Fruits Mangosteen

Share your comments

Subscribe Magazine