Health & Lifestyle

పాదాలు పగులుతున్నాయా?.. ఇలా చేస్తే సమస్యకు చెక్

KJ Staff
KJ Staff

శీతాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా చాలామంది పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. బాగా పగిలిన తర్వాత నొప్పి పుడుతూ ఉంటుంది. కొంతమందికి పాదాలు పగిలినప్పుడు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు మెడిసిన్స్, ఆయిల్‌మెంట్ వాడుతూ ఉంటారు. కానీ ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పొల్యూషన్‌కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, పాదాలపై ఎక్కువగా ఆయిల్ గ్లాండ్స్ ఉండకపోవడం వల్ల పాదాలు పొడిబారి పగుళ్లు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మెడిసిన్స్ కాకుండా ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా తగ్గించుకోవచ్చు.

ఒక బేసిన్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, రెండు స్పూన్ల గ్లిసరిన్ , రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేయాలి. కొద్దిసేపటి తర్వాత పాదాలను ఆ నీటిలో 20 నిమిషాలు ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల లాబం ఉంటుంది.

మీ పాదాలకి వెజిటబుల్ ఆయిల్ రాసుకుని ధిక్ సాక్స్ వేసుకుని రాత్రంతా అలాగే వదిలేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఇక రెండు అరటి పండ్లను పేస్ట్‌లాగా చేసుకుని పగుళ్ల ఉన్నచోట అప్లై చేసుకోండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా రోజూ చేయడం వల్ల ఫలితముంటుంది.

ఇక ఒక బేసిన్ గోరు వెచ్చని నీటిలో మూడు టేబుల్ స్పూన్ల బ్రేకింగ్ సోడా కలపి అందులో 15 నిమిషాలు పాదాలు ఉంచండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల ఉఫయోగం ఉంటుంది. అలాగే ఒక అర బకెజ్ గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు తెనె వేసి అందులో 20 నిమిషాలు పాదాలు ఉంచండి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితముంటుంది. పై వాటిని పాటించడం వల్ల మీరు పాదాల పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు.

Related Topics

padalu, pagullu

Share your comments

Subscribe Magazine