Health & Lifestyle

ఇవి ధర తక్కువ.. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ..?

KJ Staff
KJ Staff

ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చిరుధాన్యాల లో ఒకటైన ఊదలు మార్కెట్లో తక్కువ ధరకి లభించినప్పటికీ వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో దాగిఉన్న ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఎవరూ కూడా ఊదలు తినకుండా ఉండలేరు. రుచికి తియ్యగా ఉండే ఈ ఊదలను ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, చైనా, నేపాల్ వంటి దేశాలలో విరివిగా పండిస్తారు.మరి ఎంతో చవకగా లభించే ధాన్యాలలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచడానికి దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండటం చేత ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. ఉపవాసంతో ఉన్న వారు ఊదలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల వారి శరీరానికి శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇది ఎంతో సమర్థవంతమైన ఆహారం అని చెప్పవచ్చు.

ఊదలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా చిన్న ప్రేగులలో వచ్చే క్యాన్సర్లు,ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఊదలతో తయారు చేసిన ఆహార పదార్థాలను చిన్నపిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు అధికంగా పెడతారు. ఇది గర్భిణీ స్త్రీలకు ఎన్నో పోషక విలువలను అందిస్తుంది. అదేవిధంగా పిల్లలకు సరిపడా పాలను ఉత్పత్తి చేయడానికి ఊదలు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. కాలేయం, గర్భాశయ ప్రేగు క్యాన్సర్ లను నివారించడానికి ఊదలు దోహద పడతాయి.

Share your comments

Subscribe Magazine