Health & Lifestyle

అధిక ఒత్తిడితో బాధపడుతున్నారా.. అయితే ఇంట్లో ఈ మొక్కలు పెంచుకోవాల్సిందే!

KJ Staff
KJ Staff

మనకు మానసిక ప్రశాంతతను కలిగించడంలో పచ్చటి మొక్కలు, సువాసనలు వెదజల్లుతూ ఆకర్షనీయమైన రంగుల్లో ఉండే పుష్పాలు కీలక పాత్ర పోషిస్తాయి.తాజా అధ్యయనాల ప్రకారం మన ఇంటి ఆవరణలోను, పడకగదిలో మరియు మనం పనిచేస్తున్న ఆఫీస్ టేబుల్ పైన కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన ఇండోర్ ప్లాంట్స్ నాటుకోవడం వల్ల నిరంతరం మనం ఎదుర్కొనే పని ఒత్తిడిని తొలగి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే వీటిలో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తులసి మొక్కను
ఇంటి ముందు నాటుకొని పూజించడం మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. మొక్కలోని ఔషధ గుణాలు మానసిక ప్రశాంతతను కలిగించడమే కాకుండా అనేక రకాల వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. ఇంట్లో గులాబీ మొక్కలను పెట్టుకోవడం వల్ల వీటి నుంచి వచ్చే సువాసన మనసుకు ప్రశాంతంగా అనిపించి ఒత్తిడిని తగ్గిస్తాయి.

గాలిని ప్యూరిఫై చేసే అద్భుత మొక్క అలోవెరా
ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తాజాగా ఉంచి ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని బతక కలదు.బెడ్ రూమ్, బాల్కనీ, బాత్రూమ్, డ్రాయింగ్ రూమ్ ఇలా ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క మనీ ప్లాంట్ ఈ మొక్క పరిసరాలను గ్రీనరీగా మార్చి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. జాస్మిన్ మొక్కను ఇంటి ఆవరణలో పెంచడం వల్ల వీటి పూలు పరిసరాలను సువాసనలతో నింపుతుంది. తద్వారా సుఖ ప్రదమైన నిద్ర కలిగి మానసిక ప్రశాంతత కలుగుతుంద.

Share your comments

Subscribe Magazine