Health & Lifestyle

కరోనా నుంచి కోలుకున్నా.. ఇవి తప్పనిసరి!

KJ Staff
KJ Staff

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం లభిస్తోంది. అలాగే కరోనా మహమ్మారి బారినపడిన చాలామంది కోలుకొని ఇప్పుడిప్పుడే తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే కొందరి వైద్యుల సూచనల ప్రకారం కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు కొన్ని నెలలపాటు కొన్ని ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. లేకుంటే భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

చాలామంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక కూడా పోస్ట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌ కారణంగా దాదాపు మూడు నెలల పాటు కీళ్లు, కండరాల నొప్పులు,జీర్ణ సంబంధిత సమస్యలు, వాంతులు, నీళ్ల విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.ఇలాంటి వారు బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది .కాబట్టి కరోనా వైరస్ నుంచి కోలుకున్న వెంటనే రోజువారీ విధులు, పనులకు ఉపక్రమించకుండా కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటూనే నడక, తేలికపాటి వ్యాయామాలు క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

అలాగే మన ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
వ్యాధినిరోధక శక్తిని పెంచే తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలైన ఆకుకూరలు,పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. అలాగే మసాలా,జంక్ ఫుడ్,ఫాస్ట్ ఫుడ్ అసలు తీసుకోకపోవడమే మంచిది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్,ఐస్ క్రీమ్ వంటి వాటికి మూడు నెలలు దూరంగా ఉండటం మంచిది. సాధ్యమైనంతవరకు అప్పుడే వండిన వేడిగా ఉన్న తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలి.అలా చేస్తే రెండు,మూడు నెలల్లోనే తమ రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine