Health & Lifestyle

ఈ సమస్యలతో బాధ పడేవారు పెరుగు తినవద్దు ..

Srikanth B
Srikanth B


సాధారణంగా మన రోజువారీ ఆహారంలో భాగంగా పెరుగు ఎంతో ప్రాధాన్యత ఇస్తాము.ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుందని చెప్పవచ్చు

పెరుగులో మనకు మేలు కలుగచేసే బ్యాక్టీరియా ఉండటం వల్ల ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కనుక ప్రతిరోజు పెరుగు తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పెరుగును తినకూడదని, అలాంటి వారు పెరుగు తినడం వల్ల ఆ సమస్యను మరింత తీవ్రతరం అవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఏ సమస్యతో బాధపడే వారు పెరుగును తినకూడదు ఇక్కడ తెలుసుకుందాం...


ఎవరైతే తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారో అలాంటివారు పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు తరచూ పెరుగును తీసుకోవటం వల్ల వీరికి నొప్పి అధికమవుతుంది కీళ్ల నొప్పులతో బాధపడే వారు పెరుగుకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

ఆస్తమాతో బాధపడుతున్న, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవారు పొరపాటున కూడా పెరుగును తినకూడదు. ఆస్తమాతో బాధపడే వారు పెరుగును తినాలని భావిస్తే కేవలం పగటిపూట మాత్రమే పెరుగుని తిని రాత్రిపూట తినడం మానుకోవాలి.రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది.

చాలామంది అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా అసిడిటి సమస్యతో బాధపడేవారు పెరుగు కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు ఏమాత్రం తినకూడదు. అలాగే లాక్టోస్ అసహనం ఉన్నవారు పెరుగు తీసుకోవడం వల్ల వారిలో డయేరియా వచ్చే ప్రమాదం ఉంది కనుక పై తెలిపిన సమస్యలతో బాధపడే వారు పెరుగుకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

నానో యూరియా ఎరువుల ఆమోదం

Share your comments

Subscribe Magazine