చాల మంది నిద్రపోయే సమయంలో అధికంగా గురక పెడతారు, ఈ సమస్య ఎక్కువగా పెద్ద వారిలో కనబడుతుంది. గురక వల్ల మీ నిద్రతో పాటు పక్కవారికి కూడా నిద్ర లేకుండా పోతుంది. వయసు పెరిగేకొద్దీ గురక సమస్య కూడా ఎక్కువవుతూ వస్తుంది. కొన్ని పద్దతులను పాటించడం ద్వారా ఈ గురక సమస్యను నియంత్రించవచ్చు.
గురక రావడానికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తక్కువుగా ఉంటాడటం. శరీరంలో నీటి శాతం తక్కువ ఉండటం వలన రాత్రి సమయాల్లో గొంతు పొడిబారి, అక్కడి కండరాలు రాపిడికి గురవుతాయి. దీని మూలంగా భయంకరమైన గురక వస్తుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రోజు మొత్తం శరీరాన్ని హైడ్రాటెడ్ గా ఉంచుకోవాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు నీటిని తాగడం వలన రాత్రి సమయాల్లో గొంతులోని కండరాలు పొడిబారడం తగ్గి గురక రావడాన్ని నియంత్రిస్తుంది. సిగేరేట్లు, మందు అలవాటు ఉన్నవారిలో గురక అధికంగా రావడం గమనించవచ్చు. గురక ఎక్కువుగా వచ్చేవారు ఈ వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది, దీని కారణంగా మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడి, గురక సమస్య నివారించబడుతుంది.
ఈ రోజుల్లో మార్కెట్లో దాదాపు అన్ని సమస్యలు నివారణకు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గురక తగ్గించాడనికి కూడా మార్కెట్లో పరికరాలు దొరుకుతున్నాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి, నాసల్ స్ట్రిప్స్, యాంటీ స్నోరింగ్ మౌత్ పీసెస్, వీటిని ఉపయగించడం ద్వారా క్రమంగా శ్వాసతీసుకునే ప్రక్రియలో మార్పులు జరిగి, క్రమక్రమంగా గురక కట్టడి చెయ్యబడుతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చాక, మన నిద్ర అలవాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, మరీముఖ్యంగా యువత వెబ్ సిరీస్కు అలవాటు పడీ తమ అమూల్యమైన నిద్ర సమయాన్ని వీటిని వీక్షించడం కోసం వృథా చేసుకుంటున్నారు. గురక పెట్టడానికి సరైన నిద్రలేకపోవడం కూడా కారణం కావచ్చు. శరీరానికి అవసమైన నిద్రను అందిస్తే, శరీరంలోని అవయవాలు అన్ని సక్రమంగా పనిచేస్తాయి. అంతేకాకుండా గురక సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.
మారుతున్న ఆహారపు అలవాట్ల అనుగుణంగా, నేడు వయసుతో సంభంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువుతో బాధ పడుతున్నారు. బరువు అధికంగా మరీ ముఖ్యంగా గొంతు భాగంలో లావుగా ఉన్నవారిలో గురుక రావడం చూడొచ్చు. గొంతు భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోయి, గాలి మార్గం సన్నగా మారడం వలన వీరిలో గురక వస్తుంది. వీరు గురక తగ్గించుకోవడానికి ముందుగా బరువు తగ్గించుకోవాలి. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు, తద్వారా గురక కూడా తగ్గుతుంది.
Share your comments