రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం వలన పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నీరు మరియు వాతారణం కలుషితం ఆవుతున్న కారణంగా చాల మంది ప్రజలు అనేక చర్మ సమస్యల భారిన పడుతున్నారు . చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చర్మవ్యాధి సమస్యలకు గురవుతున్నారు. చాల మందిలో సూర్యరశ్మి ద్వారా కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే సరైన ఆహరం తీసుకోకపోవడం ద్వారా కూడా చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో ఉండే అల్లార్జెస్ చర్మ వ్యాధులకు కారణం అవుతాయి.
దురద, చర్మం ఎర్రబడటం, మరియు దద్దుర్లు రావడం చర్మ వ్యాధుల్లో ప్రధాన లక్షణాలు. వీలైనంత తొందరగా చికిత్స అందకపోతే చర్మ వ్యాధులు ఎక్కువై, లక్షణాలు శరీరమంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్మ వ్యాధులు ధరిచేరకుండ ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా చర్మ రోగాలను అరికట్టవచ్చు.
Read More:
తండి... తండి... కూల్... కూల్
సరైన నిద్ర లేకపోతే షుగర్ వస్తుందా???
చర్మ రోగాలను మన దగ్గరకు రాకుండా చేసేందుకు, విటమిన్-సి , మరియు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మన రోజువారీ డైట్లో చేర్చుకోవడం ఎంతో అవసరం. పళ్ళు, కూరగాయలు, బీట్రూట్, వాళ్ళనట్స్ లో మొదలైన ఆహారాల్లో మన శరీరానికి అవసరమైన, విటమిన్లు అన్ని పుష్కలంగా దొరుకుతాయి.విటమిన్- సి యాంటీ -అల్లార్జెంట్ గా పని చేసి అలెర్జిస్ రాకుండా నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండ రోజుకు 8 గ్లాసుల నీటిని తాగడం ద్వారా కూడా ఈ చర్మ రోగాలు దగ్గరకు చేరకుండా అరికట్టవచ్చు. ప్రోబైయటిక్స్ అధికంగా లభించే, పెరుగు, చీస్, మరియు ఇతర పాల పదార్ధాలు కూడా చర్మ వ్యాధులను రానివ్వకుండా చేస్తాయి. అధిక సూర్యరశ్మి కూడా చర్మవ్యాధులు రావడానికి ఒక కారణం, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, బయటకు వెళ్లే సమయంలో సన్స్క్రీమ్ అప్లై బయటకు వెళ్లడం ద్వారా ఎండా నుండి కాపాడుకొని స్కిన్ అలెర్జిస్ నుండి రక్షించుకోవచ్చు.
Share your comments