Health & Lifestyle

తండి... తండి... కూల్... కూల్

KJ Staff
KJ Staff

వేసవి కాలం మొదలైంది, సూర్యుడు అప్పుడే తన ప్రభావం చూపించి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం, ఇంట్లో కూలర్ లేదా ఏసీ అమర్చుకోవడం. ఏసీ చల్లదనం హాయిని కలిగించిన కరెంటు బిల్ మాత్రం, భాదను కలిగిస్తుంది. అయితే కూలర్ని ఏసీ కి ఒక మంచి ప్రత్యమాన్యంగా చెప్పుకోవచ్చు. ఏసీ అంత కాకపోయినా కూలర్ కూడా ఎండ వేడి నుండి తప్పించుకొని, కొంత ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ఏసీ తో పోల్చుకుంటే కూలర్ ద్వారా కరెంటు బిల్ తక్కువగానే వస్తుంది.

ఖర్చు తక్కువ కావడం వాళ్ళ మధ్యతరగతి ప్రజలు కూలర్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీన్నే అదునుగా చేసుకున్న కొందరు వ్యవపారస్థులు చీప్ బ్రాండ్స్ కూలర్లు మంచివని నమ్మించి ఎక్కువ డబ్బు దండుకుంటారు. కనుక ఈ వేసవి కాలంలో కూలర్ తీసుకునే ముంది ఒకటికి పది సార్లు అలోచించి మంచి కూలర్ తీసుకోండి.

అయితే కూలర్ కారణంగా కొంతమందిలో చర్మరోగాలు తలెత్తుతాయి. ఇటివంటి చర్మ రోగాలు తలెత్తకుండా కూలర్ ని ఎలా ఉపయోగించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి. ముందుగా కూలర్ నుండి దుర్వాసన రావడానికి, లేదా చర్మ సమస్యలు తలెత్తడానికి ముఖ్య నీరు. కూలర్ నుండి చల్లటి గాలి రావడానికి నీటితో నింపవలసి ఉంటుంది. అయితే ఈ నీటిని తరచు మార్చవల్సి ఉంటుంది. లేదంట గాలిలో ఉన్న దుమ్ము మరియు ఇతర కలుషితాలు నీటిలో కలసి నాచు, మరియు బాక్టీరియా పేరుకుపోవడానికి కారణం అవుతాయి. ఈ మలినాలు నిద్రపోయినప్పుడు గాలి ద్వారా మన శరీరం మీదకు చేరి, చర్మవ్యాధులు కలగడానికి కారణం అవుతాయి. కనుక వారానికి ఒక్క సరైన కూలర్ లోని నీటిని మార్చడం మంచిది.

మీ మొబైల్ నీటిలో పడిపోయిందా అయితే No Worry..... ఈ టిప్స్ తో మీ ఫోన్ని కాపాడుకోండి....

సరైన నిద్ర లేకపోతే షుగర్ వస్తుందా???

Share your comments

Subscribe Magazine