Health & Lifestyle

బరువు తగ్గడానికి సహాయపడే సమ్మర్ ఫుడ్స్ ఇవే......

KJ Staff
KJ Staff

నేటి యువత అందగా కనిపించడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందంగా కనిపించడానికి బరువు తగ్గాలని, చాల మంది డైటింగ్లు చేస్తూ సర్రిగ్గా తినకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందంగా ఉండాలంటే మొదట ఆరోగ్యంగా ఉండటం అవసరం. అయితే ఆరోగ్యకరంగా తింటూ బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. ఏది తినాలి ఏది తినకూడదు అనే దాని మీద అవగాహనా ఉంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడం సులభం

అన్ని రకాల కూరగాయలు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయల్లో క్యాలోరీలు తక్కువుగా ఉండటం మూలాన, శరీర బరువు పెరుగుదలకు కారణం కావు. రానున్నది వేసవి కాలం, ఈ కాలంలో అనేక రకాల కూరగాయలకు కొరత ఏర్పడుతుంది, అయితే వేసవి కాలంలో దొరికే కాయగూరలతో కూడా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు.

అటువంటి వేసవి కూరగాయల్లో ప్రధానమైనది సొరకాయ, సొరకాయలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సొరకాయతో లభించే , కాల్షియమ్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు వేసవి కాలంలో ఎంతో మేలు చేస్తాయి. సొరకాయతో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు సొరకాయ జ్యూస్ తాగడం ద్వారా ఆరోగ్యవంతంగా బరువు తగ్గేందుకు వీలుంటుంది. అంతే కాదు సొరకాయలో ఉండే నీరు మరియు యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో మేలును కల్గిస్తాయి. సొరకాయ తినడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అలాగే వేసవి సమయంలో విరివిగా లభించే కొబ్బరి నీళ్లు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు శరీరంలో వేడిని తగ్గించి శరీరం చల్లబడటానికి తోడ్పడతాయి. కొబ్బరి నీరు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా లభిస్తాయి. అస్వస్థతకు గురైన వారికి కొబ్బరి నీళ్లు దివ్యౌషధం లాగా పనిచేస్తాయి. ప్రతి రోజు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు.

Share your comments

Subscribe Magazine