Health & Lifestyle

రోజూ పప్పు తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి....

KJ Staff
KJ Staff

కంది పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన భారతీయ వంటకాల్లో పప్పుకు విశిష్టమైన స్థానం ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పప్పుతో చేసిన ఎన్నో రకాల వంటకాలను ప్రజలు తింటారు. ఇంకా పండగలు పెళ్లిళ్లకు ఐతే పప్పుతో చేసిన వంటకం లేనిదే ఆ కార్యక్రమం పూర్తి కాదు. పప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, అధికంగా తినడం ద్వారా కొన్ని దుష్ప్రభవాలు లేకపోలేదు.

పప్పులో ఫైబర్లు పుష్కలంగా లభిస్తాయి తద్వారా ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. ఫైబర్స్ మన డైట్లో చేర్చుకోవడం మూలాన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. పప్పులో ఉండే యాంటాక్సిడాంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పప్పులో ఉండే కాల్షియమ్ ఎముకుల బలానికి, ఎదుగుదలకు తోడ్పడతాయి. ముఖ్యంగా ఎదిగే వయసు పిల్లకు పప్పు తినిపించడం ద్వారా వారిలో బలమైన ఎముకలు ఏర్పడటంతో పాటు రోగనిరోధక శక్తీ కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా గుండె పనితీరును పెంచుతుంది. మెరిసే ఆకర్షణీయమైన చర్మం కావాలి అనుకునేవారు ప్రతిరోజు మీ డైట్లో పప్పును చేర్చుకోండి.

అయితే అధికంగా తింటే అమృతమైన విషంమవుతుంది. పప్పు తిన్నడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా అధిక మొత్తంలో తినడం ద్వారా కొన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీ సమస్యలతో భాదపడుతున్నవారు పప్పును వీలైనంత తక్కువ తినడం మంచిది. పప్పులో ఉండే ఆక్సలేట్స్ అనే పదార్ధాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు, అంతే కాకుండా ఈ ఆక్సలేట్స్ మూలంగా చాల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పప్పులో ఉండే ఫ్యూరిన్స్ శరీరంలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెంచుతాయి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులకు యూరిక్ ఆసిడ్ కారణం కావచ్చు, కనుక కీళ్ల నొప్పలు ఉన్నవారు, పెద్ద వయసు వారు పప్పు తక్కువుగా తింటే మంచిది.

ఈ రోజుల్లో వయసుతో సంభంధం లేకుండా ప్రతి ఒక్కరు అసిడిటీ మరియు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. పప్పులో లభించే అధిక ఫైబర్స్, ఆహారం జీర్ణం కావడంలో సహాయపడిన, పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వడానికి కారణం అవుతాయి. కాబట్టే గ్యాస్ సమస్య ఉన్నవారిని పప్పు తగ్గించమని వైద్యులు సూచిస్తారు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం ద్వారా చాల మందిలో ఎలర్జీ వస్తుంది వాటిలో పప్పుకూడా ఒకటి. పప్పు తినడం ద్వారా కొంత మందిలో దురద, వాపు వంటి సమస్యలకు దారితియ్యవచ్చు.

Share your comments

Subscribe Magazine