Health & Lifestyle

ఈ ఆహారంతో కంటి ఆరోగ్యం మెరుగుపరుచుకోండి....

KJ Staff
KJ Staff

నేడు చాల మంది రకరకాలైన కంటి సమస్యలతో భాదపడుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అంధరిని కంటి సమస్యలు భాదపెడుతున్నాయి. డిజిటల్ రంగాభివృధి చెందిన తర్వాత ఈ కంటి సమస్యలు అధికమయ్యాయి. పిల్లలు చిన్న వయసులోనే కళ్లజోళ్లు వాడే పరిస్థితి వస్తుంది. రోజంతా లాప్తొప్స్ మరియు స్మార్ట్ఫోన్స్ చూస్తూ ఉండటం వలన ఈ కాలంలో కంటి సమస్యలు ఎక్కువయ్యాయి.

అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లతో పాటు దినచర్యలో కూడా కొన్ని ,మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ పౌష్ఠికాఆహారం తీసుకుంటే కాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కంటికి మేలు కలిగించే ఆహారాల్లో అతి ముఖ్యమైనవి కూరగాయలు మరియు ఆకుకూరలు. వీటిని పచ్చివి లేదా ఊడబెట్టినవి తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మనకు సులువుగా లభించే క్యారెట్ మరియు బీట్రూట్ లో లభించే విటమిన్-ఏ కళ్ళ ఆరోగ్యానికి కీలకం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఏ లోపిస్తే కాళ్ళ సమస్యలు అధికమవుతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే యాంటీఆక్సిడాంట్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా మాంసాహారంలో చేపలు మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కంటి సమస్యలతో అధికంగా బాధపడే వారికి చేపలు ఒక వరంలా పనిచేసి ఆ సమస్యలను దూరంచేస్తాయి. కోడిగుడ్లతో లభించే విటమిన్స్ మరియు ప్రోటీన్స్ కళ్ళ ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడతాయి.

పచ్చి కూరగాయలు కళ్ళ సమస్యలకు దివ్యౌషదంలా పనిచేస్తాయి. కూరగాయలతో పాటు, విటమిన్-సి,ఏ అధికంగా లభించే నరంజ, ద్రాక్ష, బొప్పాయి, మొదలగు ఫలాలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Share your comments

Subscribe Magazine