Health & Lifestyle

వడ దెబ్బ నుంచి చిన్నారులను ఎలా రక్షించాలి !

Srikanth B
Srikanth B
వడ దెబ్బ
వడ దెబ్బ

Sun stroke tips: వేసవి చివరి దశకు  చేరుతోంది. మే నెలలో ఎండలు ఇంకా తీవ్రం కానున్నాయి.  ఎక్కవగా చిన్నారులు వడదెబ్బ  భారిన పడే  ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపధ్యంలో చిన్నారులను  ఎలా వడ దెబ్బ నుంచి ర రక్షించుకోవాలనేది ఇక్కడ  చూద్దాం !

వేసవి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఇంకా పెరగనుంది. ముఖ్యంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి . మే నెలలో వేసవి ఎండల్నించి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. చిన్నారులు, వృద్ధులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువ . ఈ నేపధ్యంలో చిన్నారుల్ని, వృద్ధుల్ని వడదెబ్బ తగలకుండా ఎలా రక్షించుకోవాలనేది తెలుసుకుందాం. కొన్ని రకాల పోషకాహారాన్ని అలవాటు చేయడం ద్వారా చిన్నారులకు వడదెబ్బ ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.

ఇక తాజా  పండ్లు  మరియు కూరగాయలు, పండ్ల రసం లేదా జ్యూస్ చిన్నారులకు అలవాటు చేయాలి. పుచ్చకాయలు, ఆరెంజ్, కివీలు ఆరోగ్యానికి బలాన్నిస్తాయి. త్వరగా ఎండదెబ్బ తగలకుండా..కాపాడుకోవచ్చు.

Benefits of Lassi : వేసవిలో లస్సీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు .. ఏమిటో తెలుసా ?

వడదెబ్బ తగలకుండా మంచి బలవర్ధకమైన ఆహారంగా ఉంటుంది. మరో ముఖ్యమైంది పెరుగు దోసకాయ. ఇందులో ఉండే 90 శాతం నీరు అద్భుతమైన హైడ్రేటెడ్ ఫుడ్‌గా పనిచేస్తుంది. పెరుగు శరీరానికి చలవ చేస్తే..దోసకాయ మంచి హైడ్రేటెడ్ ఫుడ్‌గా పనిచేస్తుంది. సత్తు పరోటా మరో కీలకమైన ఆహారం. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇదే సత్తుతో షర్బత్ కూడా చేసి ఇవ్వవచ్చు.

రోజు వారి ఆహారం లో మునగ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు !

Share your comments

Subscribe Magazine