Health & Lifestyle

కొబ్బరి నూనెతో ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యమే కాదు.. చర్మ సౌందర్యం కూడా పెంపొందించుకోవచ్చు?

KJ Staff
KJ Staff

చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్టులను వాడుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుందా! అయితే ఇంట్లోనే నాణ్యమైన కొబ్బరి నూనెతో చిన్న చిన్న చిట్కాలు పాటించి శరీర సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.అది ఏలాగో ఇప్పుడు చూద్దాం

సాధారణంగా కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండిషనర్ లాగా ఉపయోగపడి జుట్టు మృదువుగా,ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది.అలాగే శరీర సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.ఒక టేబుల్‌ స్పూన్ గానుగ పట్టి తీసిన తాజా కొబ్బరి నూనెను తీసుకొని అందులో అర టేబుల్‌స్పూన్ నిమ్మరసం,ఒక టేబుల్‌స్పూన్ పెరుగును బౌల్లో వేసి బాగా కలిపి ముఖానికి మృదువుగా పట్టించి కొన్ని నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై జిడ్డు తొలగి ఆరోగ్య వంతమైన చర్మం మీ సొంతమవుతుంది.

ఒక టేబుల్‌స్పూను తాజా కొబ్బరి నూనెలో, ఒక టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌లను కలిపి ముఖానికి మృదువుగా పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి. కొబ్బరినూనె జిగట ద్రవపదార్థం ఇది మన శరీరంలో సహజంగా ప్రవహించే సెబమ్ ను పోలి ఉంటుంది. కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం ,యాంటీఆక్సిడెంట్లు చర్మంను పొడిబారకుండా మృదువుగా ఉంచుతాయి. ఈ విధంగా కొబ్బరినూనెతో చిట్కాలను పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine