Health & Lifestyle

వ్యాయామం.. డైట్ లేకుండా బరువు తగ్గే చిట్కాలు!

KJ Staff
KJ Staff

మన జీవన విధానంలో వచ్చిన మార్పులు,జన్య పరమైన సమస్యలు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ తదితర కారణాల వల్ల ఊబకాయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.దీని కారణంగా భవిష్యత్తులో కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, బిపి షుగర్,వంటి ప్రమాదకర వ్యాధులతో నిత్యం పోరాడాల్సి వస్తుందని చాలామంది వైద్యులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు చేయడానికి సమయం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అలాంటి వారు చిన్న చిన్న చిట్కాలు పాటించి తమ శరీర బరువు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు అవేమిటో ఇప్పుడు చూద్దాం...

* ప్రతిరోజు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో చెడు కొవ్వు కరిగి బరువు సమస్య తగ్గుతుంది. మనం భోజనం చేసేటప్పుడు కంగారుగా తినకుండా నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది.

*భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే,తాగేవారు త్వరగా బరువు తగ్గుతారు. దీనికి కారణం భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు కడుపు నిండుతుంది. అలాగే భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినే చేస్తుంటాం దీంతో శరీర బరువు పెరుగుతుంది. మితిమీరిన నిద్ర కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు కాబట్టి ఈ అలవాట్లు మానుకోవాలి.

*ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ మన ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి శారీరక వ్యాయామాలు, ఏ విధమైనటువంటి కట్టిన ఆహార నియమాలు లేకుండా తొందరగా బరువు తగ్గవచ్చు.

Share your comments

Subscribe Magazine