మనిషి శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు మన శరీరానికి ఫిల్టర్లు అని పిలుస్తారు, ఎందుకంటే వాటర్ ఫిల్టర్ ఎలా ఐతే నీటిలోని మలినాలను శుభ్రం చేస్తుందో, కిడ్నీ కూడా రక్తంలోని వ్యర్ధాల్ని బయటకు పంపిస్తుంది. ప్రతిరోజు ఎన్నో లీటర్ల రక్తాన్ని కిడ్నీ వడపోస్తుంది. కిడ్నీలో ఏమైనా సమస్య ఉంటే, శరీరంలోని లవణాలు, మరియు ఇతర వ్యర్ధాలు బయటకు పోవు దీని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం చాల మందికి కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటం, ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఈ రాళ్ళూ ఎలా ఏర్పడతాయి, ఇవి రాకూండా నివారణ చర్యలు పాటించడం ఎలా అన్న విష్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు రావడానికి ఆక్సలేట్ అనే పదార్ధాలు, ఇవి మూత్రంలో ఉన్న కలిసియంతో కలిసి, ఘనీభవించడం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. మనం తినే ఆహారం నుండి ఈ ఆక్సలేట్ లభిస్తుంది, ఒకవేళ ఆహారంలో ఆక్సలేట్ శాతం ఎక్కువగా ఉంటే అప్పుడు కిడ్నీలో రాళ్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారం, పాలకూర, నట్స్, చాక్లేట్లు, వంటివి వీలైనంత తగ్గించి తినడం మంచిది.
ముందుగా కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటానికి, సరిపడినంత నీరు తాగకపోవడం ప్రధానకరణమంటున్నారు, శరీరంలో నీటి శాతం తగ్గితే ఆ ప్రాభవం కిడ్నీ మీద పడే అవకాశం ఉంది. నీరు ఎక్కువగా తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే వ్యర్ధాలన్నీ మూత్రం రూపంలో బయటకి వెళ్లిపోతాయి. అంతేకాకుండా మాంసాహారం ఎక్కువ తినేవారిలో కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మాంసాహారాన్ని కాస్త తగ్గించి, దీని స్థానంలో పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు తినడం ఉత్తమం. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందించడంతో పాటు కిడ్నీలో రాళ్లు పడకుండా నివారించడంలోనూ సహాయపడతాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఊబకాయం కూడా ప్రధాన కారణమంటున్నారు. ఊబకాయం తగ్గిచుకోవడానికి క్రమంతప్పకుండా వ్యాయామం, మంచి ఆహారం, యోగ వంటి కొన్ని లక్షణాలు అలవరచుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఆహారంలో అధికంగా ఉప్పు తినేవారిలో కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది, కనుక ఆహారం ద్వారా శరీంలోకి వెళ్లే సోడియం శాతాన్ని తగ్గించుకోవాలి.
ఇవన్నీ కేవలం నివారణ చర్యలు మాత్రమే, కిడ్నీలో రాళ్లు ఉన్నాయన్న సందేహం ఉంటె వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. కిడ్నీ రాళ్లకు సరైన సమయంలో చికిత్స పొందకపోతే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం రావచ్చు. కాబట్టి కిడ్నీ రాళ్లకు సొంత వైద్యం కాకుండా, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందడం మంచిది.
Share your comments