Health & Lifestyle

క్యాప్సికంతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో?

KJ Staff
KJ Staff

రోజూ మనం తీసుకునే కూరగాయలు, పండ్లల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి. వాటి నుంచి మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. కానీ అవి చాలామందికి తెలియదు. ఏదో ఒకటి టైమ్‌కి తింటే చాలు.. ఆరోగ్యంగా ఉంటామని చాలామంది భావిస్తారు.అంతేకానీ, ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూర్చే కూరగాయలు, ప్యూట్స్ ఏంటనేవి తెలియదు.

అయితే రోజూ మనం తీసుకునే కూరగాయల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి తినటం వల్లన ఎలాంటి ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయనేది తెలుసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాప్సికం తినడం వల్ల క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. క్యాప్సికంలో యాంటీఇన్‌ఫ్లమేటరీ పోషకాలు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ బారి నుంచి తప్పిస్తాయి. అలాగే క్యాప్సికంలో ఉండే కెరొటినాయిడ్ లైకోపిన్ గర్భ, మూత్రాశయ, క్లోమ క్యాన్సర్ల ముప్పును నియంత్రిస్తుంది

ఇక ఎముకలను దృఢంగా ఉంచడంలో క్యాప్సికం ఉపయోగపడుతుంది. ఇక రోగనిరోధకశక్తిని పెంచడంలో క్యాప్సికం ఉపయోగపడుతుంది. క్యాప్సికంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక క్యాప్సికం అంతర్గత వాపులను నివారిస్తుంది.

అలాగే క్యాప్సికంలోని విటమిన్ సి శరీరం ఇనుమును గ్రహించేలా చేస్తుంది. ఇక క్యాప్సికంలోని ఫ్రీరాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. ఇక క్యాటరాక్ట్, ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడకుండా క్యాప్సికం ఉపయోగపడుతుంది. 

Related Topics

capsicum health benefits

Share your comments

Subscribe Magazine