Health & Lifestyle

మెంతులతో ఫ్యాట్‌కు చెక్

KJ Staff
KJ Staff

మనం వంటగదిలో రోజూ ఉపయోగించే పదార్థాలు, గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. మన ఆరోగ్యం మన వంటగదిలో ఉపయోగించే కూరగాయలు, గింజలను బట్టి ఉంటుంది. శరీరానికి మంచి శక్తిని అందించే ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పటీకి మనం ఆరోగ్యంగానే ఉంటాం. ఇప్పుడు మెంతులు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాం.

మెంతుల్లో ఫైబర్, విటమిన్ ఎ,డి, ఐరన్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గువచ్చు. పొట్టలోని కోవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ మెంతులను తీసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. జిమ్‌లు, డైట్ చేసే బదులు మెంతులు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

ఇక మెంతుల్లో పుష్కలంగా లభించే ఫైబర్ వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే డయాబెటిస్ పేషెంట్స్ మెంతులను తీసుకోవడం వల్లన షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.

బరువు తగ్గాలంటే ఇలా చేయండి

రాత్రి నిద్రపోయేముందు ఒక గ్లాసు నీటిలో మెంతు గింజలు వేసి నానబెట్టండి. పొద్దున్నే పరిగడుపున అవి తాగండి. ఇలా చేస్తే.. బరువు తగ్గడంతో పాటు కొవ్వు కరుగుతుంది. అలాగే మలబద్దకం సమస్య కూడా తీరిపోతుంది. ఇక మెంతి టీ తాగడం వల్ల ఫ్యాట్ కరిగిపోతుంది.

Related Topics

mentulu, health benifits

Share your comments

Subscribe Magazine