Health & Lifestyle

పండ్లలో పోషకాలు అందాలంటే ..వాటిని ఎలా తినాలో తెలుసా?

KJ Staff
KJ Staff

సీజన్లో దొరికే పండ్లను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్య అనేది మీ దరిచేరదు అన్న విషయం చాలాసార్లు వినే ఉంటాం. మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్స్,మినరల్స్, కార్బోహైడ్రేట్స్, పోటాషియం, కాల్షియం, జింక్ , పాస్ఫరస్,ఐరన్ మాంగనీస్,రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, పోలిక్ ఆమ్లం వంటిది పెంపొందించుకోవడానికి ప్రతిరోజు తీసుకునే ఆహారంతో పాటు సీజన్లో దొరికే తాజా పండ్లను తప్పకుండా తీసుకోవాలని కొందరు వైద్యులు చెబుతున్నారు.

అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వివిధ రకాలైన పండ్లను తినేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. లేకపోతే మీరు ఎంత తాజాపండ్లు ఆహారంగా తీసుకున్న వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. అసలు పండ్లు తినేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మనం తీసుకునే పండ్లు తాజాగా నప్పటికీ తినేముందు మంచి నీటిలో శుభ్రం చేసుకున్నాకే ఆహారంగా తీసుకోవాలి.

చాలా రకాల పండ్లలో మన ఆరోగ్యానికి అవసరమైన ఖనిజ లవణాలు పండు తొక్క భాగంలో అధికంగా ఉంటాయి.అందువల్ల కొన్ని రకాల పండ్లు తినే ముందు తొక్క తీసేసి తినడం మంచిది కాదు. పండ్లను అవసరమైతే తప్ప జ్యూస్ రూపంలో తీసుకోకపోవడమే మంచిది. పండ్లను నేరుగా తినడమే ఆరోగ్యానికి మంచిది. ఈ రోజుల్లో అన్ని రకాల పండ్లను కలిపి ఒకేసారి తినడం సర్వసాధారణమైంది. కానీ అది మంచి పద్ధతి కాదు వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Share your comments

Subscribe Magazine