Health & Lifestyle

డయాబెటిస్ బాధితులకు ఆరోగ్యాన్ని అందించే పండ్లు ఇవే!

KJ Staff
KJ Staff

డయాబెటీస్.. ఇటీవల ఎక్కడ బట్టినా ఇదే మాట వింటున్నాం. 'షుగర్ వచ్చింది. అవి తినకూడదు.. ఇవి తినకూడదు' అనే మాట ఇటీవల ఎక్కువగా వినబడుతోంది. ఒకప్పుడు పోషకాలను అందించే మంచి ఆహారాన్ని తీసుకునేవారు. అందుకే మన పెద్దవారు ఇప్పుడు బలంగా ఉంటున్నారు. యాక్టివ్‌గా పనులు చేసుకోగలుగుతున్నారు. ఎలాంటి జబ్బులు దరిచేరేవి కాదు. అందుకే మన పెద్దవారు ఇప్పటికీ జీవించగలుగుతున్నారు. మనతో పోటీగా పనిచేయగలుగుతున్నారు.

కానీ ఇప్పటి ప్రజలు బిజీ లైప్‌లో ఫుడ్ తీసుకోవడమే మానేశారు. పనుల్లో పడి బయట ఏది దొరికితే అది తినేస్తున్నారు. జంక్ ఫుడ్‌కి బాగా అలవాటుపడిపోయారు. దీని వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకప్పుడు మంచి ఆహారం తీసుకోవడం వల్లన మనిషి జీవితకాలం 80 నుంచి 90 వరకు ఉండేది. కానీ ఇప్పుడు మనిషి జీవితకాలం 60 నుంచి 70కి పడిపోయింది.

ఇక యుక్త వయస్సుల్లోనే రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. యుక్త వయస్సుల్లోనే గుండెపోటు, షుగర్ లాంటి వ్యాదుల బారిన పడుతున్నారు. ఈ మధ్య 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వారు కూడా డయాబెటిస్ వచ్చింది అని చెబుతున్నారు. యుక్త వయస్సుల్లోనే ఇలాంటి వ్యాధుల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పుడు డయాబెటీస్ బాధితులు ద్రాక్ష తినొచ్చా?.. లేదా? అనేది తెలుసుకుందాం.

ద్రాక్షలో రెస్వెరాట్రల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్స్ కేవలం నల్ల ద్రాక్షను మాత్రమే తీసుకోవాలని, తెల్ల ద్రాక్షను తీసుకోవవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఇక చక్కెర వేయకుండా ద్రాక్ష రసాన్ని తీసుకోవడం మంచిందని చెబుతున్నారు.

ఏ పండ్లు తినడం మంచిది

-డయాబెటిస్ బాధితులు జామపండ్లు తింటే మంచింది. జామపండుల్లో గ్లెసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. డయాబెటిస్ ముప్పు నుంచి జామ పండ్లు రక్షస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మధుమేహ బాధితులు తింటే నరాలు దెబ్బతినే అవకావముంటుందని చెబుతున్నారు.

-ఇక మధుమేహ బాదితులు బొప్పాయ తినడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయని చెబుతున్నారు.

Related Topics

grape, diabaties, patints

Share your comments

Subscribe Magazine