Health & Lifestyle

ముఖంపై ముడతలు వచ్చాయని బాధపడుతున్నారా? ఇలా చేస్తే మటుమాయం

KJ Staff
KJ Staff
Face glow
Face glow

చాలామందికి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి. దీని వల్ల పెద్ద వయస్సులా కనిపిస్తారు. యువ్వన వయస్సులోనే ముఖంపై చాలామలంది ముడతలు వస్తున్నాయి. కాలుష్యానికి తోడు దుమ్ము,ధూళి, సరైన ఆహారం తీసుకోకపోవడం లాంటివి ముఖంపై ముడతలు రావడానికి కారణాలు. దీని కోసం చాలామంది కాస్మోటిక్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. కాస్మోటిక్స్ వాడినా కొన్ని రోజులు మాత్రమే ముఖంపై ముడతలు పోతాయి. కానీ నేచురల్ పద్దతిలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ముఖంపై ముడతల సమస్యకు శాశ్వాత చెక్ పెట్టవచ్చు.అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

నేరేడు పండ్లను తినడం వల్ల ముఖంపై వచ్చే ముడతలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ లు ఉంటాయి. వీటి వల్ల చర్మంపై ముడతలు, మెటిమలు వంటివి రావు. రోజూ నేరేడు పండ్లను తినడం వల్ల రక్త శుద్ది జరిగి ముఖం నిగనిగలా కాంతివంతంగా వెలుగుతుంది. రోజూ నేరుడు పండ్లను తినడం వల్ల ముఖంపై ముడతలు కూడా పోతాయి. సో ముఖంపై ముడతలు వచ్చి బాధపడుతున్నవారు నేరుడు పండ్లను ట్రై చేయండి.

అంతేకాకుండా నేరేడు పండ్లతో షుగర్ లెవల్ కంట్రోల్ లోకి వస్తుంది. జీర్ణవ్యవస్ధ మెరుగుపడటంతో పాటు బరువు అందుపులో ఉంటుంది. ఇక నేరేడులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి. ఇలా నేరేడు పండ్లు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నేరేడు చెట్టు ఆకులను ఎండబెట్టి, ఆ తర్వాత పోడి చేసి తోముకుంటే దంత సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇక ఒక టేబుల్ స్పూన్ చల్లని పాలల్లో 3 నుంచి 4 చుక్కల నిమ్మరసం కలిపి ముడతలు పడ్డ ప్రదేశంలో రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. మర్నాడు ఉదయం వేడి నీటితో ముఖాన్ని కడిగి గరుకుగా ఉన్న టవల్ తో తడుచుకోవాలి.మళ్లీ ఆ మిశ్రమాన్ని ముడతలు మీద వ్యతిరేక దిశలో రబ్‌ చేసి అరగంట పాటు ఉంచి ముఖాన్ని కడగాలి. ఇలా కొన్నిరోజులు చేయడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు తొలగిపోతాయి.

ఇక అర టీ స్పూన్‌ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై ముడతలు పోతాయి. ఇక బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్‌ చేసి అరగంట తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇది చర్మంపై ముడతలు పోగొట్టడంతోపాటు వుంచి టోనర్‌గా కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాదం నూనెను ముడతలు ఉన్నచోట కింది నుంచి పై వైపునకు రాసి రాత్రంతా ఉంచుకుని మర్నాడు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కూడా ముఖంపై ముడతలు పోతాయి.

Related Topics

Face, Glow, Tips

Share your comments

Subscribe Magazine