Health & Lifestyle

ఆందోళన కలిగిస్తున్న హైపటైటిస్.. నేడు ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం!

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక పని ఒత్తిడి కారణంగా మానసిక ఆందోళన చెందడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవటం వల్ల ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వ్యాధులలో హైపటైటిస్ (కాలేయ సంబంధిత వ్యాధి) వ్యాధులు అధికమవుతున్నాయి. ఈ విధంగా కాలేయ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు ఇది సిర్రోలిక్ దశకు చేరుకుని ఏకంగా కాలేయం మొత్తం దెబ్బతినే విధంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించాలని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే 2011 జూలై 28 వ తేదీని ప్రపంచ కాలేయ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రతియేటా జూలై 28న ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అధికమవుతుందని ఈ క్రమంలోనే ప్రజలలో అవగాహన కల్పించే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించాలని నిపుణులు వెల్లడించారు.

ఎక్కువగా అపరిశుభ్రమైన వాతావరణంలో జీవించేవారు, కలుషితమైన నీటిని ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్ల కాలేయం క్రమంగా దెబ్బతింటూ
ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్‌, ఆల్కహాలిక్ హెపటైటీస్ ఆల్కహాలిక్ సిర్రోసిస్ వ్యాధులు దరిచేరుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలోనే కాలేయం పని తీరు సక్రమంగా మందగించడంతో పాటు కొన్నిసార్లు క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. ఈ విధమైనటువంటి హైపటైటిస్ వ్యాధితో బాధపడే వారిలో ఎక్కువగా రక్తపు వాంతులు కావటం, క్రమంగా బరువు తగ్గిపోవడం, చర్మం, కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారి పోవడం, తీవ్రమైన కడుపునొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనబడతాయి.ఈ విధమైనటువంటి లక్షణాలు కనబడిన వారు వెంటనే వైద్యుని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు.

Share your comments

Subscribe Magazine