Health & Lifestyle

యోగ తర్వాత మీ డైట్ లో ఈ ఆహారం తప్పనిసరి!

KJ Staff
KJ Staff

యోగ చేయటం వల్ల మనసు, శరీరం రెండూ ఎంతో ప్రశాంతగా, ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఆందోళన ఒత్తిడి కూడా దూరమవుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం యోగ మాత్రమే కాకుండా యోగ తర్వాత కూడా తప్పనిసరిగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత శక్తిని అంధిస్తుంది. ముఖ్యంగా యోగ తర్వాత మన డైట్ లో తప్పనిసరిగా ఆహార పదార్థాలు ఉన్నప్పుడు మన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. మరి యోగా తర్వాత ఏ విధమైనటువంటి డైట్ ఫాలో కావాలో ఇక్కడ తెలుసుకుందాం...

యోగా చేస్తున్న సమయంలో మన శరీరం అధిక మొత్తంలో క్యాలరీలను కోల్పోతుంది. ఈ క్రమంలోనే మనం తగినన్ని కార్బోహైడ్రేట్లను ఆహార రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన శాఖాహార లేదా మాంసాహారంతో తయారు చేసిన సూప్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అదేవిధంగా సూప్ తో పాటు సలాడ్ తీసుకోవచ్చు. వివిధ రకాల పండ్లు, గింజలను ఉపయోగించి సలాడ్ తయారు చేసుకునీ తాగవచ్చు.

యోగా తర్వాత మన శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అధిక కేలరీలు కలిగిన పన్నీర్ తీసుకోవడం ఉత్తమం. ఒక వ్యక్తి నీరసించి పోయినప్పుడు వెంటనే శక్తి పొందడానికి కొబ్బరి నీళ్లు తాగించడం పూర్వకాలం నుంచి వస్తుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పోషకాలు ఉండటం వల్ల తొందరగా మన శరీరానికి శక్తి అందుతుంది. యోగా చేసిన తర్వాత ముఖ్యంగా చక్కర,కొవ్వుతో నిండిన మాంసం( మటన్, చికెన్) ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

Share your comments

Subscribe Magazine