Animal Husbandry

పొలం లో పచ్చి గడ్డి సాగుచేసే రైతులకు ఎకరానికి రూ .10000/ ప్రోత్సహకం !

Srikanth B
Srikanth B

పశువులకు కోసం మేత సాగు చేసే రైతులకుప్రభుత్వం తరఫున పశుసంవర్థక శాఖ ఎకరానికి రూ.10,000 లీజు మొత్తాన్నిచెల్లిస్తుంది.

పశుసంవర్థక శాఖ, అనంతపురం లో పశుగ్రాసం ఉత్పత్తి పథకాన్ని ప్రారంభించింది, దీనిలో కనీసం 10 ఎకరాల వరకు భూమి కలిగివున్న ఉన్న రైతులు తమ భూముల్లో ప్రభుత్వం తరుపున  మేత పెంచుకోవచ్చు , ఎకరానికి రూ.10,000 లీజు చెల్లింపును పొందవచ్చు, మరియు ప్రతి కోతకు రూ.10,000 మరియు సంవత్సరానికి మూడు కట్టింగ్ లకు రూ.30,000 కమిషన్ చెల్లింపులు కూడా పొందవచ్చు, సంవత్సరానికి మొత్తం రూ.40,000 ఆదాయం.

ప్రభుత్వం తరపున సాగు చేయబడిన మేత పాడి  రైతులకు సబ్సిడీ ధరకు పశుసంవర్థక శాఖ పది రైతులకు అందించనుంది  . ప్రభుత్వం తరఫున రైతులకు మేత సాగు చేసే రైతులకు ఈ శాఖ ఎకరానికి రూ.10,000 లీజు మొత్తాన్ని చెల్లిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పాడి రైతులు మరియు పశుగ్రాసం పెంపకందారులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఈ చొరవ రూపొందించబడింది,

ముఖ్యంగా వేసవి కాలంలో పశుగ్రాసం కొరత అధికం గ ఉంటుంది

ఈ వేసవిలో నీరు మరియు పశుగ్రాసం కొరత: పాడి  రైతులకు నిజమైన సమస్యలు :

నీటి కొరత మరియు పశుగ్రాసం కొరత  పాడి రైతులకు ప్రధాన మైన సమస్యలు ,గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ వ్యవసాయం నుండి అస్థిర ఆదాయాన్ని పొందడానికి  ఆవులు మరియు గేదెలను పెంపకం పై అధికంగా ఆధారపడి వుంటారు .

నాబార్డ్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు దేశీయ పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాయి, కొన్ని గేదెలు లేదా ఆవులను పెంచడం కూడా ఆపదలో ఉన్న రైతులకు వారి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి సహాయం అందించాయి , పశుగ్రాసం లేకపోవడం మరియు నీటి అడ్డంకుల కారణంగా తమ పొలాల్లో మేతను సాగు చేయలేకపోవడం వల్ల, చాలా మంది రైతులు పశువుల పెంపకం నిలిపివేశారు.

 

వారికి కేవలం రెండు మూడు ఎకరాల భూమి మాత్రమే ఉన్నందున, చాలా మంది చిన్న మరియు సన్నకారు రైతులు పశుగ్రాసం ఉత్పత్తిని పెనుభారంగా ఉంటుంది .కరువు పరిస్థితులను తట్టుకోవడానికి వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక శాఖలు  ముఖ్యంగా రాయలసీమ, అనంతపురంలోని ప్రతి రైతుకు వ్యవసాయ, సమీకృత పాడి  రైతుల కోసం  త్రిముఖ వ్యూహంగాఅనుసరిస్తోంది.

సుస్థిరత దిశగా అడుగు

వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండటానికి, సమీకృత వ్యూహం అవసరం. బయటి మేత సరఫరాలపై ఆధారపడటం వల్ల పాడి పరిశ్రమ సంక్షోభంలో వెళ్ళిపోతుంది , చాల మంది రైతుల లకు ఇది  భారం కావడంతో పశువులను అమ్మెస్తున్నారు .

"ప్రభుత్వం తన కొత్త పథకం ద్వారా పశుగ్రాసం లభ్యతను నిర్ధారించగలిగితే, అప్పుడు మా కుటుంబం పశువులను పెంచే మా పురాతన సంప్రదాయాన్ని పునరుత్థానం చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు  కొటాంకికి చెందిన మహిళా రైతు" కమలమ్మ" చెప్పారు.

గార్లదిన్నెకు చెందిన విద్యావంతుడైన రైతు విజయ్, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ పథకాన్ని అవలంబించవచ్చని మరియు తగినంత నీటి వనరులు ఉన్న రైతులను వాణిజ్య స్థాయిలో మేతను సాగు చేయడానికి మరియు పశువుల రైతులకు విక్రయించడానికి ప్రోత్సహించవచ్చని,  త ద్వారా పశుగ్రాసం కొరతను నిరోధిస్తుందని పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థాపకులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు మరియు సబ్సిడీలను ఇవ్వాలి.

పశువుల పెంపకం రైతులకు సేవలందించే పశుగ్రాసం ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అటువంటి సృజనాత్మక రైతుల  భూమిని లీజుకు తీసుకోవచ్చు అని  అన్నారు. 

అనుసరించండి .

వేసవిలో పాడి 'పశువుల పోషణ, యాజమాన్య నిర్వహణ పద్ధతులు :

అధిక పాల దిగుబడి కోసం రెండు క్లోన్ దూడ లను అభివృద్ధి చేసిన (NDRI )

Related Topics

greenfodder animalhusbendry

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More