Animal Husbandry

పాడి రైతులకు శుభవార్త ..... పశువుల దాణా తయారీ పరిశ్రమలు నెలకొల్పేవారికి 90% ప్రభుత్వ రాయితీ !

KJ Staff
KJ Staff
Cow
Cow

జాతీయ లైవ్ స్టాక్ మిషన్ మరియు  జాతీయ పశు సంవర్ధక శాఖ 2021 సంవత్సరం లో  సంయుక్తంగా పాడి పశువుల సంపూర్ణ పోషణ కొరకై పాశు  దాణా తయారీ పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు కేంద్ర మత్స్య మరియు పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూప్లా రాజ్యసభ లో వెల్లడించారు . ఈ మిషన్  ను కొన్ని రాష్ట్రాలు స్ఫూర్తి  గ తీసుకోవాళ్ళని సూచించారు.

ఈ స్కీమ్ ద్వారా  ఔత్సాహికులైన  రైతులకు మరియు నూతనంగా  పరిశ్రమలు నెలకొల్పలి  అనే వాళ్లకు ఆయా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ మరియు  జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్యారా పశువులకు అవసరమైన  దాణా తయారీ , నిర్వహణలో శిక్షణను అందిస్తారు . జాతీయ లైవ్ స్టాక్  మిషన్ వారు గరిష్టంగా 50 లక్షకు వరకు రాయితీ అందిస్తారు అదే విధముగా  జాతీయ పశుసంవర్ధక మరియు మౌలిక వసతుల కల్పనా అభివృద్ధి సంస్థ (AHIDF ) క్రింద అర్హులైన అభ్యర్థులకు మరియు ఇప్పుడు ఉన్న సంస్ఠ లను విస్తరించడానికి  మొత్తం ప్రాజెక్టులో 90% లోన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నది .దానితో పాటు రెండు సంవత్సరల  మారటోరియం వడ్డీ  ఫై  కల్పిస్తారు.

ఈ  పతకం క్రింద 8 రకాల సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం లభిస్తుంది అవి : పశుదాణా తయారీ మరియు నిర్వహణ , సూక్ష్మ మరియు మధ్య తరహా దాణా  తయారీ ,  దాణా తయారీ పరీక్షా కేంద్రం ,మినరల్ మిక్ససర్ తయారీ పరిశ్రమ . అయితే ఆయా పరిశ్రమలు ఆహారభద్రత సంస్థలైన FSSA I మరియు BIS నియమావళికి అనుగుణం పశుదాణా మరియు వివిధరకాలైన పోషకాలను  తయరుచేయవలసి ఉంటుంది. 

దాణా మరియు  పోషకాల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగ ఉన్నాయో లేదో తెలపడానికి BIS మరియు  FSSA I ముద్రణాలనుతప్పని సరి చేస్తూ  6 అక్టోబర్ 2021 న మార్గదర్శకాలు  జారీచేయడం జరిగింది .ఇప్పటికి కొన్ని రాష్ట్రాలు అయినా ఆంద్రప్రదేశ్ , కేరళ మరియు ఒడిశా రాష్ట్రాలు చట్టాలను చేసాయి . అయితే ఇది 1జనవరి 2022 నుంచి అన్ని దాణా పరిశ్రమలకు వర్తిచనుంది.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More