Animal Husbandry

రాష్ట్రంలో ఆర్బికేల ద్వారా పశు వైద్యసేవలు

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం మనకి తెలిసిందే. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. రైతులకు కావలసిన విత్తనాలను మరియు ఎరువులను ఈ కేంద్రాల ద్వారా రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. మరో ముందు అడుగు వేస్తూ ఇప్పుడు ఈ కేంద్రాలు పాడి పశువులకు అండగా నిలుస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా పశువులకు కావలసిన వైద్య సదుపాయాలను అందించడం వలన రైతులకు ఇబ్బంది తప్పింది.

దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువుల కొరకు వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ రథాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తానికి 340 అంబులెన్స్లను రూ.240.69 కోటను ఖర్చు పెట్టి సిద్ధం చేసింది ప్రభుత్వం. దీనితో పాటు పశు సంరక్షణకు ప్రభత్వం కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. సుమారుగా ప్రతి రోజు రాష్ట్రవ్యాప్తంగా 1500 కాల్స్ అనేవి ఈ కాల్ సెంటర్స్కు వస్తున్నాయి.

ఈ అంబులెన్క్లూ రైతులు కాల్ చేసిన తర్వాత అతి తక్కువ సమయంలోనే చేరుతున్నాయి. నియోజకవర్గానికి 2 అంబులెన్సు చెప్పున రాష్ట్రమంతటా అందించారు. ఈ అంబులెన్స్ లోకి పశువులను ఎక్కించడానికి హైడ్రాలిక్ లిఫ్ట్ వాడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అంబులెన్స్ ద్వారా 1.30 లక్షల రైతులు లాభపడ్డారు. ఈ అంబులెన్స్లో పశువుల కొరకు అనేక రకాల మందులను అందుబాటులో ఉంచారు, వీటి ఖరీదు వచ్చేసి 35 వేల రూపాయలు. ఈ రైతు భరోసా కేంద్రాలలో పశువులకు వ్యాధులు రాకుండా రోగనిరోధక టీకాలను కూడా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రాష్ట్రంలో పాడి సంపద అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు

ఈ ఆర్బికేల ద్వారా రైతులకు పాడి పశువులను పెంచేందుకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. మనుషులకు ఆధార్ కార్డు ఎలాగో పశువులకు హెల్త్కార్డులను జారీ చేసింది ప్రభుత్వం. పశువుల ఆర్హరం కొరకు ఆర్బికేల ద్వారా దాణా, పశుగ్రాస విత్తనాలు రైతుల వద్దకే అందిస్తున్నారు. పాడి రైతులకు ఆర్ధికంగా సహాయపడటానికి కిసాన్ క్రెడిట్ కార్డులతో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. రైతులకు పశువుల పరిష్కరాలను అందించడానికి 1962 టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఈ ఆర్బికేలా ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ సదుపాయాలను అందిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పశువులకు వివిధరకాలుగా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి..

రాష్ట్రంలో పాడి సంపద అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More