Education

వెటర్నరీ కోర్సుల దరఖాస్తుకు నోటోఫికేషన్ విడుదల ...

Srikanth B
Srikanth B
వెటర్నరీ కోర్సుల దరఖాస్తుకు నోటోఫికేషన్ విడుదల ...
వెటర్నరీ కోర్సుల దరఖాస్తుకు నోటోఫికేషన్ విడుదల ...

వెటర్నరీ కోర్సులను అభ్యసించి స్వయం ఉపాధి పొందాలని భావించే విద్యార్థులు , వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సులలో చేరేందు పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది . వెటర్నరీ కోర్సుల అభ్యసించడానికి ఆశక్తి కల్గిన అభ్యర్థులు జూన్ 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు లను సమర్పించవచ్చు .

ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా, పశువులు, చేపల పెంపకంపై ఆసక్తి ఉన్నవిద్యార్థులకు ఇవి వరం లాంటివి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసింది.

రెండేళ్ల వెటర్నరీ పాలిటెక్నిక్‌లు కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, మమూనూర్‌లో ఉన్నాయి. ఒక్కో పాలిటెక్నిక్‌లో 30 సీట్లు ఉండగా, మమూనూర్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి.తెలుగు మాధ్యమంలో సెమిష్టర్‌ పద్ధతిన ఈ కోర్సులు చదవాల్సి ఉంటుంది.మత్స్య కోర్సులో 11 సీట్లు ఉండగా, అవి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణాజిల్లాలోని భావదేవరపల్లిలో ఉన్నాయి.సీట్లు పొందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోనే చదవాల్సి ఉంటుంది.

రానున్న రెండు ,మూడు రోజులలో రుతుపవనాలు .. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ !

అర్హత వివరాలు:

పాలిసెట్‌-2023లో సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ పద్ధతిన సీట్లు భర్తీ చేస్తారు. అయితే, పాలిటెక్నిక్‌ అనంతరం బీఏ, బీకాం, బీబీఎం డిగ్రీలో చేరే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.375, ఇతరులు రూ.750 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.

ఫేమెంట్‌ అనంతరం ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఈనెల 19వ తేదీలోగా సమర్పించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి .

రానున్న రెండు ,మూడు రోజులలో రుతుపవనాలు .. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ !

Share your comments

Subscribe Magazine